వెనీలా స్ట్రాబెర్రీ మిల్క్ షేక్
మండే ఎండల్లో ఏదైనా చల్లగా తాగాలనిపిస్తుంది.పళ్ళు,పాలు వీటి
మిశ్రమంతో తయారయ్యే మిల్క్ షేక్స్ ఎవరికైనా నచ్చుతాయి.అన్నీ
ఫ్రిజ్ లో రెడీగా ఉంచుకుంటే నిమిషాల్లో ఇవి చేసేయొచ్చు
కావలసిన పదార్ధాలు:
స్ట్రా బెర్రీస్ ఎనిమిది
పాలు రెండుకప్పులు
ఫ్రూట్ జామ్ ఒక టేబుల్స్పూన్
వెనీలా ఐస్ క్రీం అర కప్పు
పంచదార రెండు స్పూన్లు
తయారు చేసే విధానం:
స్ట్రా బెర్రీ ముక్కలు,జామ్,పంచదార మిక్సీ జార్ లో గ్రైండ్ చేసుకోవాలి
ఇప్పుడు పాలు పోసి ఒకసారి తిప్పి,చివరగా ఐస్ క్రీం వేసి మరోసారి
బ్లెండ్ చేస్తే రుచికరమైన మిల్క్ షేక్ చల్లగా రెడీ అవుతుంది.
0 comments:
Post a Comment