మామిడి పచ్చిముక్కల పచ్చడి
మామిడికాయను చెక్కు తీసి చిన్నచిన్న ముక్కలుగా తరిగి చేసే రోటి
పచ్చడి ఇది.చాలా త్వరగా చేసేయొచ్చు,దీనినే మామిడి పచ్చిబద్దలు
అని కూడా అంటారు.అన్నంలోకి ఈ పచ్చడి చాలా బావుంటుంది
పచ్చడి ఇది.చాలా త్వరగా చేసేయొచ్చు,దీనినే మామిడి పచ్చిబద్దలు
అని కూడా అంటారు.అన్నంలోకి ఈ పచ్చడి చాలా బావుంటుంది
కావలసిన పదార్ధాలు :
మామిడికాయ ఒకటి
కారం రెండు టేబుల్ స్పూన్లు
ఉప్పు తగినంత
వెల్లుల్లి రెబ్బలు నాలుగు
కరివేపాకు ఒక రెమ్మ
నూనె రెండు టేబుల్ స్పూన్లు
తాలింపుకు శనగపప్పు,మినప్పప్పు,ఆవాలు,ఎండుమిర్చి
తయారు చేసే విధానం :
మామిడికాయ చెక్కు తీసి చిన్న ముక్కలుగా తరగాలి
కారం,ఉప్పు,వెల్లుల్లిరెబ్బలు మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి
ఇప్పుడు కొంచెం మామిడిముక్కలు కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసి,
ఒక బౌల్ లోకి తీసుకోవాలి.
ఇందులో మిగిలిన మామిడిముక్కలు కలిపి ,తాలింపు వేసి పచ్చడిలో
కలిపితే రెడీ అయిపోతుంది.
అసలు రోలు ఉంటె కారం,ఉప్పు,వెల్లుల్లి నూరి మామిడిముక్కలు వేసి
కచ్చాపచ్చాగా నూరి తాలింపు వేస్తారు.
అంత పులుపు తినలేక నేను కొంచెం ముక్కలు గ్రైండ్ చేసి మిగిలినవి
కలుపుతాను.ఇలా చేస్తే కొంచెం గుజ్జుగా కూడా ఉండి బాగుంటుంది.
ఇష్టం ఉన్నవారు ఇందులో కూడా చిటికెడు ఆవపిండి,మెంతి పిండి
కలిపి,తాలింపు పెట్టుకున్నా బాగుంటుంది.
0 comments:
Post a Comment