Thursday, April 21, 2011

చికెన్ కాజూ కుర్మా

చికెన్ తో ఎన్ని వెరైటీస్ అయినా చేసుకోవచ్చు.కాజూతో కలిపి చేసే ఈ 

కుర్మా రైస్,చపాతీ,బిర్యానీ దేనిలోకైనా బావుంటుంది.వేయించిన కాజూ

క్రిస్పీగా ఉంటూ, కొత్తిమీర ఎక్కువ వేయడంతో ఆ ఫ్లేవర్ తో చాలా 

రుచిగా ఉంటుంది.






కావలసిన పదార్ధాలు :

 చికెన్                               అర కేజీ 

ఉల్లిపాయలు                       రెండు 

పచ్చిమిర్చి                         నాలుగు 

కరివేపాకు                         ఒక రెమ్మ 

కాజూ                                అర కప్పు 

కొత్తిమీర                            ఒక కప్పు

నూనె                                తగినంత 

ఉప్పు,కారం                         తగినంత 

పసుపు                             పావు టీ స్పూన్

అల్లంవెల్లుల్లి ముద్ద              రెండు టేబుల్ స్పూన్లు 


మసాలాకు  

లవంగాలు                      ఆరు 

చెక్క                             చిన్న ముక్క 

జీలకర్ర                          ఒక టీ స్పూన్ 

ధనియాలు                    ఒక టేబుల్ స్పూన్ 

గసగసాలు                     రెండు టీ స్పూన్స్ 
 

తయారు చేసే విధానం :

ముందుగా చికెన్ లో కొంచెం ఉప్పు,కారం,పసుపు,ఒక స్పూన్  అల్లం 

వెల్లుల్లి ముద్ద వేసి బాగా కలిపి ఒక అరగంట ఫ్రిజ్ లో ఉంచాలి.

మసాలా దినుసులు అన్ని మెత్తగా పొడి కొట్టుకోవాలి.పది జీడిపప్పులు 

కూడా పొడి చేసుకోవాలి

నూనె వేడిచేసి మిగిలిన కాజూ వేయించి తీసుకోవాలి.

ఇప్పుడు అదే నూనెలో తరిగిన కొత్తిమీర,మిర్చి,తగినంత కారం వేసి 

దోరగా వేగాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించాలి.

అల్లంవెల్లుల్లి ముద్దవేసి పచ్చివాసన పోయేవరకు వేయించి,మసాలా 

పొడి,పసుపు కూడా వేసి బాగా కలిపి రెండు నిముషాలు వేయించాలి. 

ఇప్పుడు నానబెట్టుకున్న చికెన్ వేసి బాగా కలిపి సన్ననిసెగపై అయిదు 

నిమిషాలు ఉడికించి,తగినంత ఉప్పు,ఒక కప్పు నీళ్ళు కలిపి మూత 

పెట్టి ఉడికించాలి,

చికెన్ ముక్కలు మెత్తగా ఉడికిన తరువాత కాజూ పొడి, వేయించిన 

కాజూ కలిపి కూర బాగా దగ్గరయ్యే వరకు ఉడికించి దించెయ్యాలి 

ఒక బౌల్ లోకి తీసుకుని కొంచెం కొత్తిమీర చల్లితే ఎంతో రుచిగా ఉండే 

చికెన్ కాజూ కుర్మా రెడీ అవుతుంది.





Share/Bookmark

0 comments:

Post a Comment

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP