Thursday, September 15, 2011

దొండకాయ కొబ్బరి పచ్చడి

దొండకాయలు,కొత్తిమీర, కొబ్బరి కలిపి చేసే ఈ రోటిపచ్చడి అన్నంలోకి 

చాలా బావుంటుంది.కొబ్బరి వేయకుండా దొండకాయలు,కొత్తిమీర తో 

చేసుకున్నా బావుంటుంది.






కావలసిన పదార్ధాలు:


దొండకాయలు                     పావుకిలో 

కొబ్బరి తురుము                  ఒక కప్పు 

కొత్తిమీర                            ఒక కట్ట 

పచ్చిమిర్చి                        పది 

చింతపండు                        కొంచెం 

జీలకర్ర                            అర స్పూన్ 

వెల్లుల్లి రెబ్బలు                   నాలుగు 

ఉప్పు                               తగినంత

పసుపు                           చిటికెడు 

నూనె                              రెండు టేబుల్ స్పూన్లు 

తాలింపుకు 

శనగపప్పు,మినప్పప్పు,ఆవాలు,ఎండుమిర్చి,కరివేపాకు  



తయారు చేసే విధానం;


చక్రాల్లా తరిగిన దొండకాయలు,మిర్చి కలిపి ఒక స్పూన్ నూనె వేసి 

వేయించాలి 

మిర్చి,ఉప్పు,వెల్లుల్లి రెబ్బలు,జీలకర్ర,చింతపండు కలిపి మెత్తగా గ్రైండ్ 

చెయ్యాలి.

ఇప్పుడు దొండకాయ ముక్కలు,కొబ్బరి కూడా వేసి మరీ మెత్తగా 

కాకుండా కోరులా గ్రైండ్ చేసుకోవాలి.

ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి తాలింపు వేసుకుని,అందులో 

ఈ పచ్చడి, చిటికెడు పసుపు వేసి రెండు నిముషాలు వేయించాలి.

ఈ పచ్చడి కొంచెం కారంగా ఉంటేనే బావుంటుంది.కారం తక్కువ 

కావాలంటే  మిర్చి తగ్గించుకోవచ్చు.


Share/Bookmark

7 comments:

చాతకం

ఆహా. నోరూరించేలాఉన్నదండి. మనం దొండకాయ వీర ఫ్యాన్లం. నాకైతే దోస లొకి చట్నీ లాగా ఇంకా బాగుంటుందనిపిస్తుంది

లత

చాతకంగారు,
దోశల్లోకి కూడా బావుంటుందండీ.కావాలంటే ఇంకా మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. థాంక్యూ

శశి కళ

ఉల్లి పాయలు వెసుకొవచ్చా?మొత్తానికి నొరు ఊరుతుంది.

లత

శశిగారు,ఇందులో ఉల్లిపాయలు ఎప్పుడూ వెయ్యలేదండీ.ఇలా చెయ్యడమే అలవాటు

కృష్ణప్రియ

ఇది బాగుందండీ.. సాధారణం గా ఉత్తి దొండకాయలతో చేస్తారు మా ఇంట్లో. కాస్త కొబ్బరి కలిపితే బాగా వచ్చింది.

లత

థాంక్యూ కృష్ణప్రియగారూ

ఇందు

Chala bagundandi :) yummy pic. naku dondakaya pachadi ishtam. Nenu verusenaga gundlu vesta. eesaari kobbari vesta daani badulu :)

Post a Comment

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP