ఓట్స్ , అటుకుల లడ్డు
ఓట్స్ ,అటుకులు కలిపి చేసే ఈలడ్డూ చేయడం చాలా తేలిక.వెరైటీగా
కూడా ఉంటాయి.మూడు నాలుగు రోజులు ఉండాలి అంటే పాలు
కాకుండా నెయ్యి వాడితే బావుంటుంది.
కావలసిన పదార్ధాలు
ఓట్స్ ఒక కప్పు
అటుకులు ఒక కప్పు
పంచదార ఒక కప్పు
నెయ్యి
పాలు కొంచెం
ఇలాచి పొడి పావు స్పూన్
కాజు,బాదం కొద్దిగా
తయారు చేసే విధానం
నెయ్యి వేడి చేసి ఓట్స్ ను,అటుకులను సన్నని సెగపై బంగారు రంగు
వచ్చేవరకు వేయించాలి.
మైక్రోవేవ్ లో అయితే ఒక సేఫ్ బౌల్ లో నెయ్యి ,ఓట్స్,అటుకులు వేసి
ఒక నిమిషం హై లో పెట్టాలి.ఒకసారి కలిపి టెంపరేచర్ తగ్గించి ఇంకో
రెండు నిముషాలు పెడితే చక్కగా ఫ్రై అవుతాయి,
ఒక నిమిషం హై లో పెట్టాలి.ఒకసారి కలిపి టెంపరేచర్ తగ్గించి ఇంకో
రెండు నిముషాలు పెడితే చక్కగా ఫ్రై అవుతాయి,
చల్లారిన తరువాత ఓట్స్,అటుకులు,పంచదార మిక్సీలో మెత్తగా గ్రైండ్
చేసుకోవాలి
ఈ పౌడర్ ను ఒక బౌల్ లోకి తీసుకుని కాజు, బాదం వేసి ఇలాచి పొడి
కూడా వేసి కలపాలి.
కూడా వేసి కలపాలి.
ఇప్పుడు రెండు స్పూన్లు పాలు వేసి కలిపి చిన్నచిన్న లడ్డూలు
చేసుకోవాలి
చేసుకోవాలి
పాలు కాకుండా కొంచెం కరిగిన నెయ్యి వేసి కూడా లడ్డూలు
చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు.
3 comments:
వెంటనే చేసేయాలి అనిపిస్తోంది.
సింపుల్ కూడా కదా...
ట్రై చేస్తానండి.
శైలగారు,చేశాక నచ్చాయో లేదో చెప్పండి
Wow! so simple. eppudu vinaledu ee ladlu gurinchi :) choodataniki bhale unnaay!
Post a Comment