Tuesday, April 19, 2011

స్ప్రౌట్స్ కిచిడీ

మొలకెత్తిన గింజలు ఆరోగ్యానికి మంచివి అంటారు.వాటిని తినండి 

అంటే పిల్లలు సామాన్యంగా ఇష్టపడరు.అప్పుడప్పుడు ఇలా కిచిడీ లాగ 

చేస్తే చాల నచ్చుతుంది.ఏ రైతానో,కుర్మానో జత చేసామంటే అసలు పేచీ 

ఉండదు.పెసలు,శనగలు,పల్లీలు,చోలే ఇలా ఏవైనా వేసి చేయొచ్చు.





కావలసిన పదార్ధాలు :

బియ్యం                           ఒక గ్లాస్ 

స్ప్రౌట్స్                            ఒక కప్పు 

ఉల్లిపాయ                         ఒకటి 

మిర్చి                             మూడు

కరివేపాకు                        ఒక రెమ్మ 

పుదీనా                           పది ఆకులు 

కొత్తిమీర                          కొంచెం 

టమాటా                          రెండు 

కారట్ తురుము                 ఒక కప్పు  

అల్లంవెల్లుల్లి                      రెండు టీ స్పూన్స్ 

గరంమసాల పొడి               ఒక టీ స్పూన్ 

ఉప్పు                               తగినంత 

పసుపు                            కొంచెం 

నూనె                              మూడు టేబుల్ స్పూన్లు

నెయ్యి                             ఒక టేబుల్స్పూన్ 

తాలింపుకు 

మిరియాలు,జీలకర్ర,ఆవాలు,ఎండుమిర్చి  


తయారు చేసే విధానం :

బియ్యం కడిగి ఒక పావుగంట నానబెట్టుకోవాలి.

నూనె,నెయ్యి వేడిచేసి తాలింపు వేగాక ,కరివేపాకు,ఉల్లిపాయ మిర్చి 

ముక్కలు వేసి దోరగా వేయించాలి.మిరియాలు,జీలకర్ర కొంచెం ఎక్కువ 

వేస్తే స్పైసీగా రుచి బావుంటుంది 

ఇప్పుడు తరిగిన పుదీనా,కొత్తిమీర,కారట్ తురుము,టమాటా వేసి 

వేగిన తరువాత పసుపు,అల్లంవెల్లుల్లి ముద్ద, గరంమసాలపొడి వేసి 

రెండు నిమిషాలు వేయించాలి 

చివరిగా మొలకలు ,బియ్యం వేసి బాగా కలిపి తగినన్ని నీళ్ళు,ఉప్పు 

కలిపి మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి.

ఏదైనా రైతా,కుర్మా తో వేడివేడిగా వడ్డిస్తే  మొలకల కిచిడీ  రుచిగా 

నోరూరిస్తుంది.

.


Share/Bookmark

0 comments:

Post a Comment

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP