వాటర్ మెలన్ డిలైట్
పుచ్చకాయ జ్యూస్,ఐస్ క్రీం కలిపి చేసే చల్ల చల్లని ఐటెం ఇది. వెనీలా,
బటర్ స్కాచ్,స్ట్రా బెర్రీ ఇలా ఏ వెరైటీ ఐస్ క్రీం అయినా వాడొచ్చు.
కావలసిన పదార్ధాలు :
పుచ్చకాయ ముక్కలు రెండు కప్పులు
బటర్ స్కాచ్ ఐస్ క్రీం ఒక కప్పు
పంచదార రెండు టీ స్పూన్స్
నిమ్మరసం అర టీ స్పూన్
తయారు చేసే విధానం:
పుచ్చకాయ ముక్కలు గింజలు తీసేసి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి.
ఇందులో పంచదార,నిమ్మరసం,ఐస్ క్రీం వేసి బ్లెండ్ చెయ్యాలి
గ్లాస్ లోకి తీసుకుని పైన ఒక స్పూన్ ఐస్ క్రీం వేసి సర్వ్ చెయ్యాలి.
0 comments:
Post a Comment