ఆలూ బ్రెడ్ స్నాక్
ఆలూ,బ్రెడ్ చేతిలో ఉంటే రకరకాల స్నాక్స్ చెయ్యొచ్చు.అందులోనూ
పిల్లలు ఈ రెండూ ఎంత ఇష్టపడతారో చెప్పక్కర్లేదు.బేసిక్ ఆలూ కూర
చేసుకుని ఉంచుకుంటే ఏ స్నాక్ అయినా నిమిషాల్లోఅయిపోతుంది.
సమోసా,బ్రెడ్ రోల్స్,ఆలూ బోండా,ఆలూ రోల్స్ ఇలా ఎన్నో.అలా
బ్రెడ్,ఎగ్,ఆలూ కాంబినేషన్ లో చేసే ఈ స్నాక్ చాల రుచిగా ఉంటుంది.
కావలసిన పదార్ధాలు :
బ్రెడ్ నాలుగు స్లైసులు
ఆలూ కర్రీ ఒక కప్పు
ఎగ్ ఒకటి
ఉప్పు,కారం కొంచెం
నూనె ఒక టీ స్పూన్
తయారు చేసే విధానం;
ఎగ్ ను కొంచెం బీట్ చెయ్యాలి.ఇందులో కొంచెం ఉప్పు,కారం వేసి బీట్
చేసి ఉంచుకోవాలి.
బ్రెడ్ స్లైసెస్ ని ఏదైనా మూతతో రౌండ్ గా కట్ చేసుకోవాలి.
ఒక స్లైస్ మీద ఆలూకర్రీ పెట్టి రెండో స్లైస్ దాని మీద ఉంచి కొంచెం ప్రెస్
చెయ్యాలి.
ఇప్పుడు దీనిని బీట్ చేసిన ఎగ్ లో రెండు వైపులా ముంచి పేనంపై పెట్టి
కొంచెం నూనె వేసి మంచి కలర్ వచ్చేదాకా ఉంచాలి.పిల్లలకి నెయ్యి
అయినా వాడొచ్చు.
అయినా వాడొచ్చు.
అలాగే రెండో వైపు కూడా వేయించి తీసుకోవాలి.
గ్రీన్ చట్నీ లేదా టమాటో కెచప్ తో సర్వ్ చేస్తే చాల రుచిగా ఉంటుంది.
సోడా అన్నీ బజ్జీల పిండిలా కలుపుకుని ఈ ఆలూ బ్రెడ్ స్లైసెస్ ని
అందులో ముంచి తావాపై రెండువైపులా వేయించి చేసుకోవచ్చు.
0 comments:
Post a Comment