మసాలావడ
మసాలావడలు అందరూ ఇష్టపడతారు. పప్పులతో కరకరలాడుతూ
క్రిస్పీగా బావుంటాయి.పుదీనా,కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటే ఆ
ఫ్లేవర్స్ కూడా కలిసి ఇంకా రుచిగా ఉంటాయి.
కావలసిన పదార్ధాలు :
శనగపప్పు రెండు కప్పులు
పెసరపప్పు ఒక కప్పు
మినప్పప్పు అర కప్పు
ఉల్లిపాయ ఒకటి
మిర్చి ఆరు
అల్లం చిన్న ముక్క
కరివేపాకు ఒక రెమ్మ
పుదీనా అర కప్పు
కొత్తిమీర అర కప్పు
ఉప్పు తగినంత
నూనె
తయారు చేసే విధానం :
పప్పులు మూడూ రెండు మూడు గంటలు నానబెట్టి కడగాలి
కొంచెం శనగపప్పు,పెసరపప్పు తీసి పక్కన పెట్టుకోవాలి
ముందు మినప్పప్పు గ్రైండ్ చేసి అందులో శనగపప్పు,పెసరపప్పు
వేసి కొంచెం పలుకుగా గ్రైండ్ చేసుకోవాలి.
ఈపిండిని ఒక బౌల్ లోకి తీసుకుని పక్కన ఉంచుకున్న పప్పులు
ఇందులో కలపాలి
అల్లం,రెండు మిర్చి ముద్దగా నూరి పిండిలో కలపాలి.
ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి,పుదీనా,కొత్తిమీర కరివేపాకు,ఉప్పు
అన్నీ వేసి బాగా కలిపి .చిన్నచిన్న వడలు చేసి నూనెలో వేయించాలి.
గ్రీన్ చట్నీ,టమాటోసాస్ దేనితో తిన్నా ఈవడలు చాలా రుచిగా
ఉంటాయి
0 comments:
Post a Comment