కొబ్బరన్నం
కొబ్బరన్నం అంటే సాధారణంగా పచ్చికొబ్బరి తురుముతో చేస్తారు.అది
ఒక వెరైటీ అయితే కొబ్బరిపాలు ఉపయోగించి చేసే వెరైటీ ఇది.ఎక్కువ
మసాలాలు లేకుండా కొబ్బరి పాలతో ఉడికిన ఈ రైస్ మంచి ఫ్లేవర్ తో
చాలా రుచిగా ఉంటుంది.
కావలసిన పదార్ధాలు:
బాస్మతి రైస్ పావుకిలో
కొబ్బరితురుము రెండుకప్పులు
ఉల్లిపాయ ఒకటి
పచ్చిమిర్చి రెండు
కొత్తిమీర ఒక కట్ట
టమాటాలు రెండు
అల్లంవెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్
గరంమసాలాపొడి ఒక టేబుల్ స్పూన్
ఉప్పు,పసుపు,నూనె
లవంగాలు,చెక్క,యాలకులు,షాజీర,బిర్యానీ ఆకు
తయారు చేసే విధానం:
బియ్యం కడిగి ఒక పావుగంట నానబెట్టాలి.
కొబ్బరి తురుము గ్రైండ్ చేసి కొబ్బరిపాలు తీసుకోవాలి.
నూనె వేడిచేసి షాజీర,లవంగాలు,చెక్క,యాలకులు వేయాలి.సన్నగా
తరిగిన ఉల్లి,మిర్చి వేసి ఎర్రగా వేయించాలి.
తరిగిన టమాటాలు,కొత్తిమీర వేసి ఉడికిన తరువాత అల్లంవెల్లుల్లి ముద్ద
వేసి వేయించాలి.నూనె విడుతుండగా గరమ్మసాలాపొడి కూడావేసి
బియ్యానికి సరిపోయేంత కొబ్బరి పాలు పోయాలి.(సగం కొబ్బరిపాలు,
సగం నీళ్ళు కూడా వాడొచ్చు.)
తగినంత ఉప్పు,చిటికెడు పసుపు వేసి మరిగిన తరువాత బియ్యం వేసి
కలిపి కుక్కర్ మూతపెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి.
వేడిగా ఏదైనా నాన్ వెజ్ కర్రీతో కానీ,పనీర్ కర్రీతో కానీ సర్వ్ చెయ్యాలి.
2 comments:
బాగుందండి. తప్పకుండా ట్రై చేస్తాను. పెద్ద కష్టంగా కూడా లేదు:)
అవును జయగారు కొబ్బరిపాలు రెడీ చేసుకుంటే చాలు ఈజీగా అయిపోతుంది.
థాంక్యూ
Post a Comment