చింతచిగురు కొబ్బరి పచ్చడి
ఈ సీజన్ లో చింతచిగురు బాగా వస్తుంది.పప్పులో వేసినా,నాన్ వెజ్ తో
కలిపి
వండినా,పచ్చడి చేసినా ఎలా అయినా అంతా ఇష్టపడతారు.
పచ్చికొబ్బరితో చింతచిగురు కలిపి చేసే ఈ పచ్చడి అన్నంలోకి
బావుంటుంది.
కావలసిన పదార్ధాలు:
చింతచిగురు 125 గ్రాములు
చింతచిగురు 125 గ్రాములు
కొబ్బరి తురుము ఒక కాయ
ఎండుమిర్చి పదిహేను
వెల్లుల్లి రెబ్బలు ఎనిమిది
జీలకర్ర ఒక టీ స్పూన్
కరివేపాకు రెండు రెమ్మలు
ఉప్పు,నూనె
తాలింపుకు శనగపప్పు,మినప్పప్పు,ఆవాలు,ఎండుమిర్చి
తయారు చేసే విధానం:
చింతచిగురు శుభ్రం చేసి కడగాలి
తాలింపుకు శనగపప్పు,మినప్పప్పు,ఆవాలు,ఎండుమిర్చి
తయారు చేసే విధానం:
చింతచిగురు శుభ్రం చేసి కడగాలి
ఒక టేబుల్ స్పూన్ నూనె వేడిచేసి ఎండుమిర్చి దోరగా వేయించి
తీసుకోవాలి
మరో రెండు స్పూన్లు నూనె వేసి చింతచిగురు వేసి వేయించాలి.మగ్గిన
తరువాత
కొబ్బరి తురుము కూడా వేసి రెండు నిముషాలు వేయించాలి.
ఎండుమిర్చి,ఉప్పు,జీలకర్ర,వెల్లుల్లి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు వేగిన చింతచిగురు,కొబ్బరి మిశ్రమం వేసి గ్రైండ్ చేసుకోవాలి.
రెండు టీ స్పూన్స్ నూనె వేడిచేసి తాలింపు వేసి పచ్చడిలో కలపాలి.
వేడివేడి
అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పచ్చడి తింటే చాలా రుచిగా
ఉంటుంది.
ఎవరి టేస్ట్ కి తగ్గట్టు ఎండుమిర్చి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు.
1 comments:
enta baagundoooooo!!! naku ikkada chintachiguru dorakadu :(((((
Post a Comment