కుకీస్ మిల్క్ షేక్
మరొక చల్లని మిల్క్ షేక్ పిల్లల కోసం.ఇందులో బటర్ స్కాచ్ కుకీస్
కానీ,చాక్లెట్ కుకీస్ కానీ వాడొచ్చు.పాలు,ఐస్ క్రీం,కుకీస్ అన్నీ
ఉంటాయి కనుక వెరైటీగాఉంటుంది.
కావలసిన పదార్ధాలు:
బటర్ స్కాచ్ కుకీస్ మూడు
వెనీలా ఐస్ క్రీం అర కప్పు
చల్లని పాలు ఒక కప్పు
తయారు చేసే విధానం:
ముందుగా కుకీస్ ను చిన్న ముక్కలు చేసి పాలు కలిపి
బ్లెండ్ చేసుకోవాలి
ఇప్పుడు ఐస్ క్రీం వేసి ఒకసారి బ్లెండ్ చెయ్యాలి. గ్లాస్ లో పోసి పైన
కొంచెం ఐస్ క్రీం వేసి ఇస్తే బావుంటుంది
ఐస్ క్రీం లోనూ,కుకీస్ లోనూ స్వీట్ ఉంటుంది కనుక పంచదార
వేయనక్కర్లేదు
0 comments:
Post a Comment