ఆలూ జీరా రైస్
రైస్ ఐటమ్స్ చేయడం చాలా తేలిక.ఇంట్లో కూరగాయలు లేనప్పుడు
కానీ ఒక పూట కూర చెయ్యలేకపోయినా అయిదు నిమిషాల్లో ఇవి
చేసెయ్యొచ్చుఎక్కువ మసాలాలు లేకుండా జీరా ఫ్లేవర్,ఆలూ కలిపి
చేసే ఈ ఐటం లంచ్ బాక్స్ లోకి కూడా బావుంటుంది.
.
కావలసిన పదార్ధాలు:
ఆలూ ఒకటి
అన్నం రెండు కప్పులు
ఉల్లిపాయ ఒకటి
పచ్చిమిర్చి రెండు
కరివేపాకు ఒక రెమ్మ
కొత్తిమీర కొద్దిగా
అల్లం చిన్న ముక్క
మసాలాపొడి ఒక టీ స్పూన్
జీలకర్ర ఒక టీ స్పూన్
ఉప్పు,కారం,పసుపు,నూనె,ఆవాలు,ఎండుమిర్చి.
తయారు చేసే విధానం:
నూనె వేడి చేసి జీలకర్ర,ఆవాలు,ఎండుమిర్చి వేయాలి.ఇవి కొంచెం
వేగగానే సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి,అల్లం వేసి వేయించాలి.
కరివేపాకు,సన్నగా తరిగిన ఆలూ వేసి కలిపి కొంచెం ఉప్పు,పసుపు
చల్లి మగ్గనివ్వాలి.
ఆలూ ఉడికిన తరువాత కారం,గరంమసాలాపొడి, కొత్తిమీర, అన్నం
కూడా వేయాలి.తగినంత ఉప్పు చల్లి బాగా కలిపి రెండు నిముషాలు
ఉంచితే సరిపోతుంది.
ఇష్టం ఉంటే చివరగా ఒక స్పూన్ కరివేపాకు కారం కానీ,పుట్నాలపప్పు
కారంపొడి కానీ చల్లితే మంచి టేస్ట్ వస్తుంది.ఇది వేసినప్పుడు కారం
కొంచెం తక్కువ వేసుకోవాలి.
2 comments:
chala bagundandi :) manchi rice item!!!
అవును ఇందూ,చేయడం కూడా చాలా ఈజీ
Post a Comment