ఐస్ క్రీం - మాంగో మిల్క్ షేక్
ఐస్ క్రీం,మామిడిపండు ఇవి అందరికీ ఇష్టమే.ఈ రెండూ కలిపి చేసే
మిల్క్ షేక్ చాలా రుచిగా ఉంటుంది.
కావలసిన పదార్ధాలు:
మామిడి ముక్కలు అర కప్పు
వెనీలా ఐస్ క్రీం ఒక కప్పు
పంచదార రెండు టీ స్పూన్స్
చల్లని పాలు ఒక కప్పు
తయారు చేసే విధానం:
మామిడి ముక్కలు,పంచదార కలిపి గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు చల్లని పాలు పోసి బ్లెండ్ చెయ్యాలి
చివరగా ఐస్ క్రీం వేసి బ్లెండ్ చేస్తే క్రీమీగా ఉండే మిల్క్ షేక్ రెడీ
0 comments:
Post a Comment