కారట్ మూంగ్ దాల్ ఖీర్
కారట్ పెసరపప్పు కలిపి చేసే హెల్దీ ఖీర్ ఇది.పెసరపప్పు నానబెట్టుకుని
రెడీ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది.
కావలసిన పదార్ధాలు
పెసరపప్పు ఒక కప్పు
కారట్ తురుము ఒక కప్పు
చిక్కని పాలు అర లీటరు
పంచదార రెండు కప్పులు
ఇలాచీ పొడి ఒక టీ స్పూన్
కాజూ,నెయ్యి
తయారు చేసే విధానం:
పెసరపప్పు రెండుగంటలు నానబెట్టి మెత్తగా ఉడికించుకోవాలి.
ఒక టీ స్పూన్ నెయ్యి వేడిచేసి కాజూ వేయించి తీసుకోవాలి.
మరొక రెండు స్పూన్లు నెయ్యి వేసి కారట్ తురుమును వేయించాలి.
ఇప్పుడు పాలు పోసి కారట్ తురుము ఉడికించాలి.
ఉడికిన పప్పు కూడా కలిపి పంచదార వేయాలి.బాగా ఉడికి ఖీర్ చిక్కగా
అయ్యాక ఇలాచీ పొడి వేసి కలపాలి.
కాజూ వేసి ఫ్రిజ్ లో ఉంచి చల్లగా సర్వ్ చేస్తే బావుంటుంది.
2 comments:
వెరైటీ ఖీర్ ను పరిచయం చేసినందుకు కృతజ్ఞతలండి.
థాంక్ యూ
Post a Comment