Thursday, April 12, 2012

సేమ్యా కేసరి

అప్పటికప్పుడు ఏమైనా స్వీట్ చెయ్యాలి అంటే ఈజీగా అయిపోయే వెరైటీ

ఈ సేమ్యా కేసరి. నెయ్యి కూడా తక్కువే పడుతుంది.








కావలసిన  పదార్ధాలు:


సేమ్యా                                 ఒక కప్పు 

పాలు                                  ఒక కప్పు 

పంచదార                              ఒక కప్పు 

నీళ్ళు                                 ఒక కప్పు 

నెయ్యి                               పావు కప్పు 

ఇలాచీ పొడి                        పావు స్పూన్ 

బాదం మిక్స్                       ఒక టీ స్పూన్ 


తయారు చేసే విధానం:


ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేడిచేసి కాజూ,కిస్మిస్ వేయించి 

తీసుకోవాలి.

మరొక స్పూన్ నెయ్యి వేసి సేమ్యాను వేయించుకోవాలి.ఇందులో పాలు,

నీళ్ళు పోసి సేమ్యాను ఉడికించాలి.

సేమ్యా పూర్తిగా ఉడికిన తరువాత పంచదార వేయాలి.

మిశ్రమం ఉడికి కొంచెం దగ్గరవుతుండగా ఇలాచీ పొడి,బాదం మిక్స్ 

వేసి కలిపి మిగిలిన నెయ్యి వేయాలి.

ఒక బౌల్ లోకి తీసుకుని కాజూ,కిస్మిస్ పైన వేయాలి.

ఇన్ స్టంట్ బాదం మిక్స్ వేస్తే కొంచెం కలర్,ఫ్లేవర్ వస్తుంది.ఫుడ్ కలర్ 

వేయకుండా సరిపోతుంది.ఇది లేకపోతే ప్లెయిన్ గా కూడా 

చేసెయ్యొచ్చు.
 


Share/Bookmark

2 comments:

జ్యోతి

లతగారు, అప్పుడప్పుడు బెల్లంతో చేస్తే కూడా బావుంటుంది. ట్రై చేసారా??

లత

లేదు జ్యోతిగారూ,బెల్లం,పెసరపప్పు వేసి సేమ్యా చక్రపొంగలి చేస్తాను కానీ కేసరి ఎప్పుడూ చెయ్యలేదు.ట్రై చేస్తాను ఒకసారి

Post a Comment

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP