Sunday, April 22, 2012

ప్రాన్స్ కాజూ ఫ్రై

సీ ఫుడ్ లో అందరూ చాలా ఇష్టంగా తినేవి రొయ్యలు.వీటికి కాజూ 

కలిపి ఫ్రై చేస్తే చాలా బావుంటుంది.బిర్యానీ,పులావ్ ల్లోకి మంచి 

కాంబినేషన్ అవుతుంది.





కావలసిన పదార్ధాలు:


రొయ్యలు                   ఒక కేజీ 

ఉల్లిపాయ                   ఒకటి 

పచ్చిమిర్చి                 రెండు 

కరివేపాకు                  రెండు రెమ్మలు 

కొత్తిమీర                    ఒక కట్ట 

టమాటా ప్యూరీ             ఒక టేబుల్ స్పూన్

జీడిపప్పు                    కొద్దిగా

ఉప్పు,కారం,పసుపు,నూనె 

మసాలాకు 

ఆరేడు లవంగాలు,చిన్న దాల్చినచెక్క,ఒక టేబుల్ స్పూన్ ధనియాలు,

ఒక టీస్పూన్ జీలకర్ర,ఒక టేబుల్ స్పూన్ గసగసాలు,

చిన్న అల్లంముక్క,వెల్లుల్లి రెబ్బలు ఏడెనిమిది     


తయారు చేసే విధానం:



నూనె వేడిచేసి సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి వేసి ఎర్రగా వేయించాలి.

ఇప్పుడు కరివేపాకు,శుభ్రం చేసుకున్న రొయ్యలు,పసుపు వేయాలి.

ఈలోగా మసాలాలు అన్నీ మెత్తగా పొడి చెయ్యాలి. ఇందులోనే 

అల్లం,వెల్లుల్లి,కొత్తిమీర కొంచెం నీరు పోసి పేస్ట్ చేసుకోవాలి.

రొయ్యలు కొంచెం ఉడికిన తరువాత ఈ పేస్ట్,టమాటా ప్యూరీ,తగినంత

ఉప్పు వేసి కలిపి ఉడికించాలి.

రొయ్యలు పూర్తిగా ఉడికి కూర బాగా దగ్గరవుతుండగా వేయించుకున్న 

జీడిపప్పు వేసి,కొంచెం తరిగిన కొత్తిమీర వేసి రెండు నిముషాలు ఉంచి 

స్టవ్ ఆఫ్ చెయ్యాలి.

జీడిపప్పును కూరలో కలిపి కూడా ఉడికించవచ్చు.అయితే ఇలా విడిగా 

వేయించి కలిపితే క్రిస్పీగా బావుంటాయి.






Share/Bookmark

0 comments:

Post a Comment

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP