డబల్ కా మీటా
చాలా పాపులర్ హైదరాబాదీ స్వీట్ ఇది.ఈ స్వీట్ ను ఒక్కొక్కరు ఒక్కో
పధ్ధతిలో చేస్తారు.ఎలా చేసినా చాలా రుచిగా ఉంటుంది.నెయ్యి కాస్త
ఎక్కువే పడుతుంది కానీ ఎప్పుడన్నా ఒకసారి తింటాము కనుక పర్లేదు.
కావలసిన పదార్ధాలు:
బ్రెడ్ స్లైసెస్ నాలుగు
పంచదార ఒక కప్పు
పాలు రెండు కప్పులు
నెయ్యి,ఇలాచీ పొడి ,కాజూ,కిస్మిస్
తయారు చేసే విధానం:
బ్రెడ్ స్లైసెస్ ను ఎండలో కానీ,ఫ్యాన్ గాలికి కానీ ఆరబెట్టాలి.వాటిలో
తడి అంతా పోయి డ్రైగా అవుతాయి.ఇలా చేయడం వలన నెయ్యి
కొంచెం తక్కువ పీల్చుకుంటాయి.
వీటిని నేతిలో వేయించి తీసుకుని పాలలో వేసి నాననివ్వాలి.
పంచదారలో కొంచెం నీళ్ళు పోసి పాకం వచ్చాక ఇలాచీ పొడివేసి కలిపి
పాలల్లో నానిన బ్రెడ్ స్లైసెస్ ను వేయాలి.మొత్తం ఉడికి నెయ్యి బయటికి
వస్తుండగా స్టవ్ ఆఫ్ చెయ్యాలి.మిశ్రమం ఉడికేటప్పుడు ఎక్కువగా
గరిటతో కలపకూడదు.అలా చేస్తే హల్వాలాగా అయిపోతుంది.బ్రెడ్
చిన్నచిన్న పీసెస్ గా ఉంటేనే బావుంటుంది.
ఒక బౌల్ లోకి తీసుకుని నేతిలో వేయించిన కాజూ,కిస్మిస్ లతో
అలంకరించుకోవాలి.
3 comments:
hii.. Nice Post Great job.
Thanks for sharing.
Best Regarding.
More Entertainment
ఈ స్వీట్ నాకు చాలా ఇష్టం. చేయాలి. నాకు బాగా కుదురుతుందోలేదో!
నాకు కూడా చాలా ఇష్టం జయగారూ
చేసెయ్యండి,తప్పకుండా బాగా వస్తుంది
Post a Comment