Saturday, April 30, 2011

కసూరి మేథీ చికెన్

కసూరిమేథి చాల మంచి ఫ్లేవర్ ఇస్తుంది.తాజా మెంతికూర బదులు ఈ 

కసూరి మేథి వేసి చేసిన చికెన్ ఐటం ఇది.మంచి సువాసనతో చాలా 

రుచిగా బావుంటుంది.






కావలసిన పదార్ధాలు :

 చికెన్                                  అర కేజీ 

కసూరిమేతీ                           పావు కప్పు 

ఉల్లిపాయ                             ఒకటి 

మిర్చి                                  రెండు 

కరివేపాకు                            ఒక రెమ్మ 

టమాటప్యూరీ                        అర కప్పు 

అల్లంవెల్లుల్లిముద్ద                  రెండు టీ స్పూన్లు

ఉప్పు,కారం,నూనె                   తగినంత 

పసుపు                               కొంచెం

కొత్తిమీర                              ఒక కట్ట

నిమ్మరసం                           ఒక టేబుల్ స్పూన్ 

మసాలకు 

లవంగాలు                        ఆరు

చెక్క                               చిన్న ముక్క 

జీలకర్ర                           ఒక టీ స్పూన్ 

ధనియాలు                     ఒక టేబుల్ స్పూన్ 


తయారు చేసే విధానం:

చికెన్ లో కొంచెం ఉప్పు,కారం,అల్లంవెల్లుల్లి ముద్ద,నిమరసం వేసి కలిపి 

ఒక అరగంట నాననివ్వాలి 

కసూరిమేతి ని నీళ్ళలో వేసి ఉంచాలి.

మసాలాలు అన్నీ మెత్తగా పొడి కొట్టి ఉంచుకోవాలి.

నూనె వేడిచేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ,మిర్చి,కరివేపాకు వేసి 

దోరగా వేగనివ్వాలి.

ఇప్పుడు నీళ్ళలో నానబెట్టిన కసూరిమేతి వేసి కొంచెం వేయించి అల్లం

వెల్లుల్లి ముద్ద కూడా వేసి వేయించాలి.

పసుపు,కారం,టమాట ప్యూరీ,మసాల పొడి వేసి బాగా కలిపి రెండు 

స్పూన్ల నీరు వేసి నూనె తేలేవరకు వేయించాలి.

నానబెట్టుకున్న చికెన్ వేసి బాగా కలిపి  సన్నని సెగపై అయిదు 

నిముషాలు ఉంచి,తగినంత ఉప్పు,ఒక కప్పు నీళ్ళు పోసి మూత పెట్టి 

చికెన్ మెత్తగా ఉడికేవరకు ఉంచాలి.

సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కూర బాగా దగ్గరయ్యాక దించెయ్యాలి.

ఒక బౌల్ లోకి తీసి కొంచెం కొత్తిమీర చల్లితే ఘుమఘుమలాడుతూ 

మేథి ఫ్లేవర్ తో చికెన్ కూర రెడీ అవుతుంది.


Share/Bookmark

Wednesday, April 27, 2011

వాటర్ మెలన్ డిలైట్

పుచ్చకాయ జ్యూస్,ఐస్ క్రీం కలిపి చేసే చల్ల చల్లని ఐటెం ఇది. వెనీలా,

బటర్ స్కాచ్,స్ట్రా బెర్రీ ఇలా ఏ వెరైటీ ఐస్ క్రీం అయినా వాడొచ్చు.






కావలసిన పదార్ధాలు :

పుచ్చకాయ ముక్కలు                        రెండు కప్పులు 

బటర్ స్కాచ్ ఐస్ క్రీం                            ఒక కప్పు 

పంచదార                                        రెండు టీ స్పూన్స్ 

నిమ్మరసం                                      అర టీ స్పూన్



తయారు చేసే విధానం:

పుచ్చకాయ ముక్కలు గింజలు తీసేసి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి.

ఇందులో పంచదార,నిమ్మరసం,ఐస్ క్రీం వేసి బ్లెండ్ చెయ్యాలి 

 గ్లాస్ లోకి తీసుకుని  పైన ఒక స్పూన్  ఐస్ క్రీం వేసి సర్వ్ చెయ్యాలి. 


Share/Bookmark

Sunday, April 24, 2011

ఆలూ బ్రెడ్ స్నాక్

ఆలూ,బ్రెడ్ చేతిలో ఉంటే రకరకాల స్నాక్స్ చెయ్యొచ్చు.అందులోనూ 

పిల్లలు ఈ రెండూ ఎంత ఇష్టపడతారో చెప్పక్కర్లేదు.బేసిక్ ఆలూ కూర 

చేసుకుని ఉంచుకుంటే ఏ స్నాక్ అయినా నిమిషాల్లోఅయిపోతుంది.

సమోసా,బ్రెడ్ రోల్స్,ఆలూ బోండా,ఆలూ రోల్స్ ఇలా ఎన్నో.అలా 

బ్రెడ్,ఎగ్,ఆలూ కాంబినేషన్ లో చేసే ఈ స్నాక్ చాల రుచిగా ఉంటుంది.







కావలసిన  పదార్ధాలు :


బ్రెడ్                               నాలుగు స్లైసులు 

ఆలూ కర్రీ                        ఒక కప్పు 

ఎగ్                                 ఒకటి 

ఉప్పు,కారం                      కొంచెం

నూనె                            ఒక టీ స్పూన్ 


తయారు చేసే విధానం;


ఎగ్ ను కొంచెం బీట్ చెయ్యాలి.ఇందులో కొంచెం ఉప్పు,కారం వేసి బీట్ 

చేసి ఉంచుకోవాలి.

బ్రెడ్ స్లైసెస్ ని ఏదైనా మూతతో రౌండ్ గా కట్ చేసుకోవాలి.

ఒక స్లైస్ మీద ఆలూకర్రీ పెట్టి రెండో స్లైస్ దాని మీద ఉంచి కొంచెం ప్రెస్ 

చెయ్యాలి.

ఇప్పుడు దీనిని బీట్ చేసిన ఎగ్ లో రెండు వైపులా ముంచి పేనంపై పెట్టి 

కొంచెం నూనె వేసి మంచి కలర్ వచ్చేదాకా ఉంచాలి.పిల్లలకి  నెయ్యి 

అయినా వాడొచ్చు.

అలాగే రెండో వైపు కూడా వేయించి తీసుకోవాలి.

గ్రీన్ చట్నీ లేదా టమాటో కెచప్ తో సర్వ్ చేస్తే చాల రుచిగా ఉంటుంది.

ఎగ్ తిననివారు శనగపిండి,కొంచెం వరిపిండి,ఉప్పు,కారం,చిటికెడు 

సోడా అన్నీ బజ్జీల పిండిలా కలుపుకుని ఈ ఆలూ బ్రెడ్ స్లైసెస్ ని 

అందులో ముంచి తావాపై రెండువైపులా వేయించి చేసుకోవచ్చు.


Share/Bookmark

Thursday, April 21, 2011

చికెన్ కాజూ కుర్మా

చికెన్ తో ఎన్ని వెరైటీస్ అయినా చేసుకోవచ్చు.కాజూతో కలిపి చేసే ఈ 

కుర్మా రైస్,చపాతీ,బిర్యానీ దేనిలోకైనా బావుంటుంది.వేయించిన కాజూ

క్రిస్పీగా ఉంటూ, కొత్తిమీర ఎక్కువ వేయడంతో ఆ ఫ్లేవర్ తో చాలా 

రుచిగా ఉంటుంది.






కావలసిన పదార్ధాలు :

 చికెన్                               అర కేజీ 

ఉల్లిపాయలు                       రెండు 

పచ్చిమిర్చి                         నాలుగు 

కరివేపాకు                         ఒక రెమ్మ 

కాజూ                                అర కప్పు 

కొత్తిమీర                            ఒక కప్పు

నూనె                                తగినంత 

ఉప్పు,కారం                         తగినంత 

పసుపు                             పావు టీ స్పూన్

అల్లంవెల్లుల్లి ముద్ద              రెండు టేబుల్ స్పూన్లు 


మసాలాకు  

లవంగాలు                      ఆరు 

చెక్క                             చిన్న ముక్క 

జీలకర్ర                          ఒక టీ స్పూన్ 

ధనియాలు                    ఒక టేబుల్ స్పూన్ 

గసగసాలు                     రెండు టీ స్పూన్స్ 
 

తయారు చేసే విధానం :

ముందుగా చికెన్ లో కొంచెం ఉప్పు,కారం,పసుపు,ఒక స్పూన్  అల్లం 

వెల్లుల్లి ముద్ద వేసి బాగా కలిపి ఒక అరగంట ఫ్రిజ్ లో ఉంచాలి.

మసాలా దినుసులు అన్ని మెత్తగా పొడి కొట్టుకోవాలి.పది జీడిపప్పులు 

కూడా పొడి చేసుకోవాలి

నూనె వేడిచేసి మిగిలిన కాజూ వేయించి తీసుకోవాలి.

ఇప్పుడు అదే నూనెలో తరిగిన కొత్తిమీర,మిర్చి,తగినంత కారం వేసి 

దోరగా వేగాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించాలి.

అల్లంవెల్లుల్లి ముద్దవేసి పచ్చివాసన పోయేవరకు వేయించి,మసాలా 

పొడి,పసుపు కూడా వేసి బాగా కలిపి రెండు నిముషాలు వేయించాలి. 

ఇప్పుడు నానబెట్టుకున్న చికెన్ వేసి బాగా కలిపి సన్ననిసెగపై అయిదు 

నిమిషాలు ఉడికించి,తగినంత ఉప్పు,ఒక కప్పు నీళ్ళు కలిపి మూత 

పెట్టి ఉడికించాలి,

చికెన్ ముక్కలు మెత్తగా ఉడికిన తరువాత కాజూ పొడి, వేయించిన 

కాజూ కలిపి కూర బాగా దగ్గరయ్యే వరకు ఉడికించి దించెయ్యాలి 

ఒక బౌల్ లోకి తీసుకుని కొంచెం కొత్తిమీర చల్లితే ఎంతో రుచిగా ఉండే 

చికెన్ కాజూ కుర్మా రెడీ అవుతుంది.





Share/Bookmark

Tuesday, April 19, 2011

స్ప్రౌట్స్ కిచిడీ

మొలకెత్తిన గింజలు ఆరోగ్యానికి మంచివి అంటారు.వాటిని తినండి 

అంటే పిల్లలు సామాన్యంగా ఇష్టపడరు.అప్పుడప్పుడు ఇలా కిచిడీ లాగ 

చేస్తే చాల నచ్చుతుంది.ఏ రైతానో,కుర్మానో జత చేసామంటే అసలు పేచీ 

ఉండదు.పెసలు,శనగలు,పల్లీలు,చోలే ఇలా ఏవైనా వేసి చేయొచ్చు.





కావలసిన పదార్ధాలు :

బియ్యం                           ఒక గ్లాస్ 

స్ప్రౌట్స్                            ఒక కప్పు 

ఉల్లిపాయ                         ఒకటి 

మిర్చి                             మూడు

కరివేపాకు                        ఒక రెమ్మ 

పుదీనా                           పది ఆకులు 

కొత్తిమీర                          కొంచెం 

టమాటా                          రెండు 

కారట్ తురుము                 ఒక కప్పు  

అల్లంవెల్లుల్లి                      రెండు టీ స్పూన్స్ 

గరంమసాల పొడి               ఒక టీ స్పూన్ 

ఉప్పు                               తగినంత 

పసుపు                            కొంచెం 

నూనె                              మూడు టేబుల్ స్పూన్లు

నెయ్యి                             ఒక టేబుల్స్పూన్ 

తాలింపుకు 

మిరియాలు,జీలకర్ర,ఆవాలు,ఎండుమిర్చి  


తయారు చేసే విధానం :

బియ్యం కడిగి ఒక పావుగంట నానబెట్టుకోవాలి.

నూనె,నెయ్యి వేడిచేసి తాలింపు వేగాక ,కరివేపాకు,ఉల్లిపాయ మిర్చి 

ముక్కలు వేసి దోరగా వేయించాలి.మిరియాలు,జీలకర్ర కొంచెం ఎక్కువ 

వేస్తే స్పైసీగా రుచి బావుంటుంది 

ఇప్పుడు తరిగిన పుదీనా,కొత్తిమీర,కారట్ తురుము,టమాటా వేసి 

వేగిన తరువాత పసుపు,అల్లంవెల్లుల్లి ముద్ద, గరంమసాలపొడి వేసి 

రెండు నిమిషాలు వేయించాలి 

చివరిగా మొలకలు ,బియ్యం వేసి బాగా కలిపి తగినన్ని నీళ్ళు,ఉప్పు 

కలిపి మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి.

ఏదైనా రైతా,కుర్మా తో వేడివేడిగా వడ్డిస్తే  మొలకల కిచిడీ  రుచిగా 

నోరూరిస్తుంది.

.


Share/Bookmark

Friday, April 15, 2011

వెనీలా స్ట్రాబెర్రీ మిల్క్ షేక్

మండే ఎండల్లో ఏదైనా చల్లగా తాగాలనిపిస్తుంది.పళ్ళు,పాలు వీటి 

మిశ్రమంతో తయారయ్యే మిల్క్ షేక్స్ ఎవరికైనా నచ్చుతాయి.అన్నీ 

ఫ్రిజ్ లో రెడీగా ఉంచుకుంటే నిమిషాల్లో ఇవి చేసేయొచ్చు 

 



కావలసిన పదార్ధాలు:

స్ట్రా బెర్రీస్                             ఎనిమిది 

పాలు                                 రెండుకప్పులు

ఫ్రూట్ జామ్                         ఒక టేబుల్స్పూన్ 

వెనీలా ఐస్ క్రీం                      అర కప్పు 

పంచదార                             రెండు స్పూన్లు 

తయారు చేసే విధానం:

స్ట్రా బెర్రీ ముక్కలు,జామ్,పంచదార  మిక్సీ జార్ లో గ్రైండ్ చేసుకోవాలి 

ఇప్పుడు పాలు పోసి ఒకసారి తిప్పి,చివరగా ఐస్ క్రీం వేసి మరోసారి 

బ్లెండ్ చేస్తే రుచికరమైన మిల్క్ షేక్ చల్లగా రెడీ అవుతుంది.


Share/Bookmark

Wednesday, April 13, 2011

మసాలావడ

మసాలావడలు అందరూ ఇష్టపడతారు. పప్పులతో కరకరలాడుతూ

క్రిస్పీగా బావుంటాయి.పుదీనా,కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటే ఆ 

ఫ్లేవర్స్ కూడా కలిసి ఇంకా రుచిగా ఉంటాయి.






కావలసిన పదార్ధాలు :

శనగపప్పు                     రెండు కప్పులు 

పెసరపప్పు                     ఒక కప్పు 

మినప్పప్పు                    అర కప్పు 

ఉల్లిపాయ                      ఒకటి 

మిర్చి                           ఆరు 

అల్లం                           చిన్న ముక్క 

కరివేపాకు                     ఒక రెమ్మ 

పుదీనా                        అర కప్పు 

కొత్తిమీర                       అర కప్పు 

ఉప్పు                           తగినంత 

నూనె 

తయారు చేసే విధానం :

పప్పులు మూడూ రెండు మూడు గంటలు నానబెట్టి కడగాలి 

కొంచెం శనగపప్పు,పెసరపప్పు తీసి పక్కన పెట్టుకోవాలి 

ముందు మినప్పప్పు గ్రైండ్ చేసి అందులో శనగపప్పు,పెసరపప్పు 

వేసి కొంచెం పలుకుగా గ్రైండ్ చేసుకోవాలి.

ఈపిండిని ఒక బౌల్ లోకి తీసుకుని పక్కన ఉంచుకున్న పప్పులు 

ఇందులో కలపాలి

అల్లం,రెండు మిర్చి ముద్దగా నూరి పిండిలో కలపాలి.

ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి,పుదీనా,కొత్తిమీర కరివేపాకు,ఉప్పు 

అన్నీ వేసి బాగా కలిపి .చిన్నచిన్న వడలు చేసి నూనెలో వేయించాలి.

గ్రీన్ చట్నీ,టమాటోసాస్ దేనితో తిన్నా ఈవడలు చాలా రుచిగా 

ఉంటాయి


Share/Bookmark

Monday, April 11, 2011

మామిడి పచ్చిముక్కల పచ్చడి

మామిడికాయను చెక్కు తీసి చిన్నచిన్న ముక్కలుగా తరిగి చేసే రోటి 

పచ్చడి ఇది.చాలా త్వరగా చేసేయొచ్చు,దీనినే మామిడి పచ్చిబద్దలు 

అని కూడా అంటారు.అన్నంలోకి ఈ పచ్చడి చాలా బావుంటుంది  






కావలసిన పదార్ధాలు :

మామిడికాయ                     ఒకటి

కారం                                రెండు టేబుల్ స్పూన్లు 

ఉప్పు                                తగినంత 

వెల్లుల్లి రెబ్బలు                    నాలుగు 

కరివేపాకు                         ఒక రెమ్మ 

నూనె                               రెండు టేబుల్ స్పూన్లు 

తాలింపుకు శనగపప్పు,మినప్పప్పు,ఆవాలు,ఎండుమిర్చి 


తయారు చేసే విధానం :

మామిడికాయ చెక్కు తీసి చిన్న ముక్కలుగా తరగాలి 

కారం,ఉప్పు,వెల్లుల్లిరెబ్బలు మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి  

ఇప్పుడు కొంచెం మామిడిముక్కలు కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసి,

ఒక బౌల్ లోకి తీసుకోవాలి.

ఇందులో మిగిలిన మామిడిముక్కలు కలిపి ,తాలింపు వేసి పచ్చడిలో 

కలిపితే రెడీ అయిపోతుంది.

అసలు రోలు ఉంటె కారం,ఉప్పు,వెల్లుల్లి నూరి మామిడిముక్కలు వేసి 

కచ్చాపచ్చాగా నూరి తాలింపు వేస్తారు.

అంత పులుపు తినలేక నేను కొంచెం ముక్కలు గ్రైండ్ చేసి మిగిలినవి 

కలుపుతాను.ఇలా చేస్తే కొంచెం గుజ్జుగా కూడా ఉండి బాగుంటుంది.

ఇష్టం ఉన్నవారు ఇందులో కూడా చిటికెడు ఆవపిండి,మెంతి పిండి 

కలిపి,తాలింపు పెట్టుకున్నా బాగుంటుంది.
                                 


Share/Bookmark

Thursday, April 7, 2011

మాగాయ పచ్చడి

ఆవకాయ తరువాత అంతగానూ ఇష్టపడి తినే పచ్చడి మాగాయ.

మాగాయ మహాపచ్చడి,పెరుగేస్తే మహత్తరి అంటూ పాట కూడా 

రాసారు కదా.అంత రుచిగా ఉండే ఈ పచ్చడి ఎలా చెయ్యాలో చూద్దాం.

ఈపచ్చడికి స్పెషల్ గా రసాలు,జలాలు అంటూ వెతకవలసిన అవసరం 

లేదు.మామూలు కాయలైనా పుల్లగా ఉంటే చాలు చేసెయ్యొచ్చు.







కావలసిన పదార్ధాలు :

మామిడికాయలు                      రెండు 

కారం                                   మూడు టేబుల్ స్పూన్లు 

ఉప్పు                                    తగినంత 

ఆవపిండి                              ఒక టీ స్పూన్ 

మెంతిపిండి                           అర టీ స్పూన్ 

నూనె                                   ఒక కప్పు 

కరివేపాకు                             రెండు రెమ్మలు 

పసుపు                                చిటికెడు 

తాలింపుకు శనగపప్పు.మినప్పప్పు,ఆవాలు,ఎండుమిర్చి,వెల్లుల్లిరెబ్బలు 


తయారు చేసే విధానం:

మామిడికాయను చెక్కుతీసి కడిగి తుడిచి వాలికలుగా ముక్కలు 

కొయ్యాలి 

ఈ ముక్కలలో ఒక స్పూన్ ఉప్పు,చిటికెడు పసుపు వేసి బాగా కలిపి 

రెండు మూడు గంటలు ఉంచాలి.

ఇప్పుడు ఊరిన రసంలో నుండి ముక్కలు వేరుచేసి ఎండలో పెట్టాలి 
.
మంచి ఎండలో రెండు గంటలు ఉంచితే చాలు.

ఈ మామిడి రసం లో కారం,ఆవపిండి,మెంతి పిండి,తగినంత ఉప్పు 

వేసి,చివరగా మామిడి ముక్కలు కూడా వేసి బాగా కలపాలి 

నూనె వేడి చేసి తాలింపు వేసి,చిదిమిన వెల్లుల్లిరెబ్బలు,కరివేపాకు వేసి ,
ఈ తాలింపును పచ్చడిలో కలిపితే ఎర్రగా నోరూరిస్తూ మాగాయపచ్చడి 

రెడీ.ఇష్టం ఉన్నవారు తాలింపులో కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు 


Share/Bookmark

Monday, April 4, 2011

ఉగాది పచ్చడి, కారట్ పూర్ణాలు

తెలుగువారికి అతిముఖ్యమైన పండుగ ఉగాది.మామిడితోరణాలూ,

పచ్చిమామిడికాయలూ,పిండివంటలతో పాటూ ఉగాదిపచ్చడితో అన్ని 

లోగిళ్ళూ ఘుమఘుమలాడి పోతాయి.తీపీ,పులుపూ,వగరూ,ఉప్పూ 

ఇలా అన్నిరకాల రుచులతో కూడినది ఈ ఉగాది పచ్చడి






కావలసిన పదార్ధాలు :

మామిడిముక్కలు                          అరకప్పు 

చింతపండు గుజ్జు                            అర కప్పు 

బెల్లం                                         అరకప్పు 

అరటిపండు                                  ఒకటి 

ద్రాక్షపళ్ళు                                   పది

వేపపువ్వు                                   కొంచెం 

ఉప్పు                                         చిటికెడు

కొబ్బరి తురుము                          కొంచెం



తయారు చేసే విధానం :

చింతపండు నానబెట్టి చిక్కగా పులుసు తీసుకోవాలి.

ఇందులో సన్నగా తరిగిన బెల్లం వేసి మెదిపి కరగనివ్వాలి.

సగం అరటిపండు ముక్కలు వేసి కొంచెం మెత్తగా మెదిపి,మిగిలిన 

పండు ముక్కలు వెయ్యాలి.

ఇప్పుడు మామిడిముక్కలు,శుభ్రంచేసిన వేపపువ్వు,కొబ్బరితురుము,

ద్రాక్షముక్కలు,చిటికెడు ఉప్పువేసి ఒకసారి కలిపితే  రుచికరమైన 

ఉగాదిపచ్చడి సిద్దం.


కారట్  పూర్ణాలు



కొన్నిచోట్ల పూర్ణాలు అన్నా,కొన్నిచోట్ల బూరెలు అన్నా పండుగ అంటే 

 ఇవి తప్పనిసరిగా ఉంటాయి.ఎక్కువగా శనగపప్పు,బెల్లం ఉడికించి 

చేసినా, అప్పుడప్పుడు ఇలా కారట్ తో చేసుకుంటే వెరైటీగా ఉంటాయి





కావలసిన పదార్ధాలు :

కారట్ తురుము              రెండు కప్పులు

పంచదార                      ఒక కప్పు

పాలు                           ఒక కప్పు

నెయ్యి                          రెండు స్పూన్లు

కాజు,బాదం,కిస్మిస్

పూత పిండికి

మినప్పప్పు           ఒక కప్పు

బియ్యంపిండి        రెండు కప్పులు 

ఉప్పు                   తగినంత

నూనె


తయారు చేసే విధానం


బియ్యంపిండిని కొంచెం నీటితో ముద్దగా కలుపుకోవాలి

మినప్పప్పు రెండు గంటలు నానబెట్టుకుని మెత్తగా రుబ్బుకుని తడిపిన 

బియ్యంపిండిలో వేసి తగినంత ఉప్పు  కలిపి ఒక గంట నాననివ్వాలి

నెయ్యి వేడి చేసి కాజు,బాదం,కిస్మిస్ వేయించి తీసుకోవాలి.

అదే నెయ్యిలో కారట్ తురుము వేసి వేయించి పాలు పోసి ఉడికించాలి

పాలు ఇగిరిన తరువాత పంచదార వేసి ,అది కరిగి మళ్లీ బాగా 

దగ్గరయ్యే వరకు ఉడికించాలి.

చల్లారిన తరువాత డ్రై ఫ్రూట్స్ కలిపి చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి

ఈ ఉండలను రెడీగా ఉన్న పిండిలో ముంచి కాగిన నూనెలో వేయించి 

తీసుకోవాలి.

అంతే, కమ్మని రుచితో కారట్ బూరెలు  రెడీ  అవుతాయి,




Share/Bookmark

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP