సేమ్యా చక్రపొంగలి
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
ఈ కొత్త సంవత్సరంలో తీయతీయగా కమ్మని ఈ స్వీట్ చేసుకుందాం.
కావలసిన పదార్ధాలు :
సేమ్యా రెండు కప్పులు
పెసరపప్పు ముప్పావు కప్పు
బెల్లం రెండు కప్పులు
పంచదార అర కప్పు
పాలు మూడు కప్పులు
నెయ్యి అర కప్పు
యిలాచీ పొడి ఒక స్పూను
కాజూ తగినన్ని
తయారు చేసే విధానం:
ముందుగా పెసరపప్పు కుక్కర్ లో వేసి తగినన్ని నీళ్ళు పోసి
ఉడికించుకోవాలి.
ఉడికించుకోవాలి.
రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసి కాజూ వేయించి ,
పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఇదే నెయ్యిలో సేమ్యా వేసి బంగారు రంగు వచ్చేవరకూ
వేయించాలి.
వేగిన సేమ్యాలో కాగిన పాలు పోసి ఉడకనివ్వాలి.సేమ్యా ఉడికిన
తరువాత ఉడికించిన పెసరపప్పు కూడా వేసి బాగా కలపాలి.
ఇందులో సన్నగా తరిగిన బెల్లం,పంచదార వేసి కలిపి ఉడికించాలి.
బాగా దగ్గరయ్యేటప్పుడు ఇలాచీ పొడి,మిగిలిన నెయ్యి వేసి కలిపి
దించెయ్యాలి.
ఇందులో పంచదార,బెల్లం ఎవరి రుచి కి తగ్గట్టు ఎక్కువ తక్కువ
వేసుకోవచ్చు
బౌల్ లోకి తీసుకుని వేయించిన కాజూ తో అలంకరించుకుంటే వేడి వేడి
సేమ్యా చక్రపొంగలి సిద్దం
1 comments:
మీక్కూడా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు !
Post a Comment