ఊతప్పం
చాలా మంచి ట్రెడిషనల్ రెసిపీ ఈ ఊతప్పం.చాలా వరకూ మిగిలిన దోశ,
ఇడ్లీ పిండి
తో చేస్తారు కానీ ఫ్రెష్ గా తగిన కొలతలతో రుబ్బి చేస్తే చాలా
బావుంటుంది
కావలసిన పదార్ధాలు:
మినప్పప్పు ఒక గ్లాస్
మినప్పప్పు ఒక గ్లాస్
బియ్యం ఒకటిన్నర గ్లాస్
ఉప్పుడుబియ్యం ఒకటిన్నర గ్లాస్
ఉల్లిపాయలు రెండు
ఉల్లిపాయలు రెండు
పచ్చిమిర్చి రెండు
కరివేపాకు ఒక రెమ్మ
అల్లం చిన్న ముక్క
కారట్ ఒకటి
ఉప్పు,నూనె
తయారు చేసే విధానం:
మినప్పప్పు ,బియ్యం అన్నీ నానబెట్టుకోవాలి.ఉప్పుడు బియ్యం మాత్రం
ఉదయాన్నే నానబెట్టేస్తే బాగా మెత్తగా నలుగుతాయి.నాలుగైదు గంటలే
టైం ఉంటే ఉప్పుడుబియ్యం మాత్రం వేడినీళ్ళలో నానబెట్టుకోవాలి.
మూడూ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.తెల్లవారి ఉదయానికి పిండి
పొంగి
రెడీ అవుతుంది.
తగినంత ఉప్పు కలిపి తవాపై కొంచెం మందంగా ఊతప్పం వేయాలి.
పైన సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి,కరివేపాకు,అల్లం.కారట్ తురుము
చల్లి నూనె
వేసి మూత పెట్టెయ్యాలి.
చిన్న మంటపై ఉడకనివ్వాలి.రెండో వైపుకు తిప్పనవసరం లేదు పైన
స్టీం కు
ఉడికిపోతుంది.
అడుగున క్రిస్ప్ గా కరకరలాడుతూ పైన స్పాంజ్ లా మెత్తగా ఉండే
ఊతప్పంను
వేడిగా కొబ్బరి పచ్చడితో సర్వ్ చేస్తే బావుంటుంది
5 comments:
లత గారూ మీరు వంట తేలిగ్గా చేసుకునేలా చాలా చక్కగా వ్రాస్తారు. చదవగానే వెంటనే చేయాలనిపిస్తాయి.
థాంక్యూ జ్యోతిర్మయిగారూ
వావ్ ..ఊతప్పం. నాకు చాలా ఇష్టం. ఉప్మా,దోసె,ఇడ్లీ ,పూరీ,చపాతీ,పొంగల్,ఇవన్నీ నాకు అసలు ఇష్టం లేదు.
ఏమిటో..ఇప్పుడే తినాలనిపిస్తుంది. ఆకలవుతుంది. మీరు నాకు వడ్డించ లేరని నాకు తెలుసు.ప్చ్ రేపు ఉదయం ట్రై చేస్తాను.గా.
థాంక్ యూ..లతాజీ ..
థాంక్యూ వనజగారూ,
చేసి మీకు నచ్చిందో లేదో చెప్పండి
bhale colourful ga undandi :)
Post a Comment