గోంగూర పచ్చడి
ఆవకాయ తరువాత అంత ఇష్టంగానూ తినే పచ్చడి గోంగూర.ఈ
పచ్చడిని కూడా చాలా
రకాలుగా చేస్తారు ఎండుమిర్చి వేసి చేసే ఈ
పచ్చడి కూడా నిలువ ఉంటుంది.
కావలసిన పదార్ధాలు:
గోంగూర ఆరుకట్టలు
గోంగూర ఆరుకట్టలు
ఎండుమిర్చి పదిహేను
వెల్లుల్లి రెబ్బలు పది
జీలకర్ర ఒక టీ స్పూన్
కరివేపాకు రెండు రెమ్మలు
ఉప్పు,నూనె
తాలింపుకు శనగపప్పు,మినప్పప్పు,ఆవాలు,ఎండుమిర్చి,వెల్లుల్లి రెబ్బలు
తయారు చేసే విధానం:
గోంగూర ఆకులు కడిగి ఆరబెట్టాలి.నీరు పోయిన తరువాత రెండు
గోంగూర ఆకులు కడిగి ఆరబెట్టాలి.నీరు పోయిన తరువాత రెండు
మూడు స్పూన్స్ నూనె
వేసి బాగా వేయించాలి.
మరొక పాన్ లోఒక స్పూన్ నూనె వేసి ఎండుమిర్చి దోరగా వేయించాలి.
ఎండుమిర్చి,తగినంతః ఉప్పు,వెల్లుల్లి రెబ్బలు,జీలకర్ర మెత్తగా గ్రైండ్
చేసుకోవాలి.
గోంగూరలో ఈ ఎండుమిర్చి మిశ్రమం వేసి నూరుకోవాలి.
తగినంత నూనె వేడి చేసి తాలింపు వేసి పచ్చడిలో కలిపితే కమ్మని
గోంగూర
పచ్చడి రెడీ అవుతుంది.
కారాన్ని బట్టి ఎండుమిర్చి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు.అలాగే
పులుపు
కూడా.గోంగూర బాగా పుల్లగా ఉంటే చింతపండు అక్కర్లేదు,
లేకపోతే కొంచెం
చింతపండు కూడా వాడొచ్చు
1 comments:
wowwwww! asalu aa pic chustuntene noroorutondi :) ultimate
Post a Comment