కాబేజ్ టమాటా పచ్చడి
కాబేజ్ అంటే ఎక్కువగా కూరగా మాత్రమే చేస్తాము.కానీ దీనితో రోటి
పచ్చడి కూడా
చెయ్యొచ్చు.టమాటా,కొత్తిమీర కలిపి చేస్తే అన్నంలోకి,
టిఫిన్స్ లోకి కూడా
బావుంటుంది.
కావలసిన పదార్ధాలు:
కాబేజ్ పావుకిలో
కాబేజ్ పావుకిలో
టమాటాలు రెండు
పచ్చిమిర్చి పది
కొత్తిమీర ఒక కట్ట
జీలకర్ర ఒక టీ స్పూన్
చింతపండు పేస్ట్ ఒక టీ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు నాలుగు
ఉప్పు,నూనె
తయారు చేసే విధానం:
కాబేజ్ ను కడిగి సన్నగా తరగాలి.
కాబేజ్ ను కడిగి సన్నగా తరగాలి.
కాబేజ్,టమాటా ముక్కలు,కొత్తిమీర,పచ్చిమిర్చి కలిపి నూనె వేసి
వేయించాలి.కాబేజ్ బాగా ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చెయ్యాలి.
కొంచెం చల్లారిన తరువాత మిర్చి,ఉప్పు,జీలకర్ర,వెల్లుల్లి గ్రైండ్
చేసుకోవాలి.
ఇప్పుడు కాబేజ్ మిశ్రమం వేసి గ్రైండ్ చెయ్యాలి.
ఇష్టమైతే ఈ పచ్చడికి తాలింపు కూడా పెట్టుకోవచ్చు.
ఈ పచ్చడి కొంచెం స్పైసీగా ఉంటేనే బావుంటుంది.కారం తక్కువ
తినేవారు మిర్చి
ఎడ్జస్ట్ చేసుకోవచ్చు.
0 comments:
Post a Comment