సోయా పాలక్ రైస్
ఆరోగ్యానికి ఎంతో మంచివైన సోయా గ్రాన్యూల్స్, పాలకూర కలిపి చేసే
హెల్దీ
రైస్ ఐటం ఇది.అన్నీ రెడీ చేసుకుంటే త్వరగా చేసెయ్యొచ్చు.
కావలసిన పదార్ధాలు :
సోయా గ్రాన్యూల్స్ ఒక కప్పు
సోయా గ్రాన్యూల్స్ ఒక కప్పు
పాలకూర మూడు కట్టలు
అన్నం రెండు కప్పులు
ఉల్లిపాయ ఒకటి
పచ్చిమిర్చి రెండు
కరివేపాకు ఒక రెమ్మ
కొత్తిమీర ఒక కట్ట
పుదీనా కొద్దిగా
అల్లంవెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్
గరం మసాలా పొడి ఒక టీ స్పూన్
ఉప్పు,పసుపు,కారం,నూనె
లవంగాలు,చెక్క,షాజీర
తయారు చేసే విధానం:
సోయాగ్రాన్యూల్స్ ను మరిగే నీళ్ళలో రెండు నిముషాలు ఉడికించి
తయారు చేసే విధానం:
సోయాగ్రాన్యూల్స్ ను మరిగే నీళ్ళలో రెండు నిముషాలు ఉడికించి
వడపోయాలి.చల్లని నీళ్ళతో కడిగి నీరు పిండేసి ఉంచుకోవాలి.
పాలకూర సన్నగా తరిగి అర స్పూన్ నూనె వేసి ఉడికించి పెట్టుకోవాలి.
నూనె వేడి చేసి రెండు లవంగాలు ,చిన్న దాల్చిన చెక్క ముక్క,షాజీర
వేయాలి.
సన్నగా తరిగిన ఉల్లిపాయ,మిర్చి,కరివేపాకు వేసి వేయించాలి.
అల్లంవెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించి సోయాగ్రాన్యూల్స్ వేయాలి.తడి
అంతా
పోయి డ్రై గా వేయించాలి.
ఉడికించిన పాలకూర వేసి బాగా కలిపి పసుపు,కారం,గరం మసాలా
పొడి వేయాలి.
చివరగా అన్నం,తగినంత ఉప్పు,తరిగిన కొత్తిమీర,పుదీనా వేసి బాగా
కలిపి రెండు
మూడు నిముషాలు వేయించాలి.
3 comments:
chala bagundandi :) manchi item. thanks!
మీ రెసిపీ చూసి 'సోయా పాలక్ రైస్' చేశాను. చాలా బాగా వచ్చింది. ధన్యవాదాలు.
థాంక్స్ ఇందూ,
థాంక్యూ జ్యోతిర్మయి గారూ,మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి
Post a Comment