పనీర్ ఫ్రైడ్ రైస్
చల్లగా ఉండే ఈ శీతాకాలంలో వేడివేడిగా రైస్ వెరైటీస్ నోరూరిస్తాయి.
ఈజీగా చేసుకోగల ఈ పనీర్ ఫ్రైడ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది.కొంచెం
స్పైసీగా లంచ్ బాక్స్ లోకి కూడా బావుంటుంది
ఈజీగా చేసుకోగల ఈ పనీర్ ఫ్రైడ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది.కొంచెం
స్పైసీగా లంచ్ బాక్స్ లోకి కూడా బావుంటుంది
కావలసిన పదార్ధాలు:
బాస్మతి బియ్యం ఒక గ్లాస్
పనీర్ వంద గ్రాములు
పచ్చిబటానీ అర కప్పు
కారట్ తురుము అర కప్పు
కొబ్బరితురుము అర కప్పు
ఉల్లిపాయ ఒకటి
మిర్చి ఒకటి
కొత్తిమీర ఒక కట్ట
అల్లంవెల్లుల్లి ముద్ద ఒక టీ స్పూన్
గరంమసాలా పొడి ఒక టీ స్పూన్
మిరియాలపొడి ఒక టీ స్పూన్
టమాటాసాస్ ఒక టేబుల్ స్పూన్
రెడ్ చిల్లీ సాస్ ఒక టేబుల్ స్పూన్
కొద్దిగా కాజూ,తగినంత ఉప్పు,అర టీస్పూన్ కారం,
రెండు టేబుల్ స్పూన్స్ నూనె
తయారు చేసే విధానం:
బియ్యం కడిగి పొడిపొడిగా అన్నం వండుకోవాలి.
ఒక టీ స్పూన్ నూనెలో కాజూ,పనీర్ ముక్కలు వేయించి తీసుకోవాలి.
నూనె వేడిచేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ,మిర్చివేసి దోరగా
వేయించాలి.
ఇందులో కారట్ తురుము,ఉడికించిన బటానీలు, కొబ్బరితురుము
కూడా వేసి కలిపి వేయించాలి.
అల్లంవెల్లుల్లి ముద్ద,కారం,సాస్ లు వేసి బాగా కలిపి వేగిన తరువాత
పనీర్ ముక్కలు,అన్నం వేయాలి.
తగినంత ఉప్పు,మిరియాలపొడి,గరంమసాలా పొడి,కొత్తిమీర వేసి బాగా
కలుపుతూ సన్నని మంటపై వేయించుకోవాలి.
ఒక ప్లేట్ లోకి తీసుకుని కొంచెం కొత్తిమీర,వేయించిన కాజూతో
అలకరించుకోవాలి.
3 comments:
:) ఇప్పుడే అనుకుంటున్నా.. పదవ టపా రాలేదు అని ..
Looks yummy!
Latha garu :) nenu 2 weeks back chesanu idi :) first time meekante mundu naa anthata nenu okati chesa ;)
Mee pics maatram super :) yummy yummy malli chesukuni tinalanundi :))
థాంక్యూ కృష్ణప్రియగారూ
వెరీగుడ్ ఇందూ,మళ్ళీ చేసెయ్యండి మరి
Post a Comment