బీట్రూట్ వడ
బీట్రూట్ హెల్త్ కి మంచిది.కూరగా ఇష్టపడనివారు వెరైటీగా ఈ వడలు
చేసుకోవచ్చు.కొంచెం బీట్రూట్ స్వీట్ ఫ్లేవర్ తో,కొంచెం స్పైసీగా,
కలర్ ఫుల్ గా బావుంటాయి.
కావలసిన పదార్ధాలు:
శనగపప్పు రెండు కప్పులు
బీట్రూట్ తురుము ఒక కప్పు
ఉల్లిపాయ ఒకటి
పచ్చిమిర్చి మూడు
కరివేపాకు రెండు రెమ్మలు
అల్లం చిన్న ముక్క
జీలకర్ర ఒక టీస్పూన్
బియ్యంపిండి రెండు టేబుల్ స్పూన్స్
ఉప్పు తగినంత
నూనె
తయారు చేసే విధానం:
శనగపప్పు రెండు గంటలు నానబెట్టుకోవాలి.
రెండుమూడు స్పూన్స్ పప్పును విడిగా తీసి మిగిలిన పప్పులో జీలకర్ర,
అల్లం,మిర్చికలిపి గ్రైండ్ చేసుకోవాలి
ఇందులో బీట్రూట్ తురుము, బియ్యంపిండి,తగినంత ఉప్పు,సన్నగా
తరిగిన ఉల్లిపాయ,కరివేపాకు వేసి బాగా కలపాలి.
తీసి ఉంచిన శనగపప్పు కూడా వేసి చిన్నచిన్నవడలు చేసి కాగిన
నూనెలో వేయించుకోవాలి.
సాస్ తో కానీ,చట్నీ తో కానీ వేడివేడిగా తింటే బావుంటాయి.
4 comments:
Cool... I want to try this! :)
వావ్ బావుంది.మీరు చెప్పేవి బలే సింపుల్ గా ఉంటాయి.ట్రై చేస్తున్నాము కూడా...థాంక్స్ అండీ.
లత గారూ,
ఇవాళ బీట్రూట్ వడలు చేశానండీ.. బాగా కుదిరాయి. రుచి బాగున్నాయి. Thanks for the recipe. :)
థాంక్యూ మధురా
Post a Comment