కారప్పూస
పిండివంటల్లో ఎక్కువ చేసుకునేది కారప్పూస.శలవులు వచ్చాయంటే
పిల్లలకి ఇదో,జంతికలో ఏవో ఒకటి ఉండాల్సిందే.
కావలసిన పదార్ధాలు:
శనగపిండి అరకిలో
బియ్యంపిండి అరకిలో
వెన్నపూస వంద గ్రాములు
ఉప్పు,కారం తగినంత
వాము పొడి రెండు టీ స్పూన్స్
నూనె
తయారు చేసే విధానం:
శనగపిండి,బియ్యంపిండి జల్లించి ఉప్పు,కారం,వాముపొడి,వెన్న వేసి
బాగా కలుపుకోవాలి.
కొంచెం పిండిని తగినన్ని నీళ్ళతో ముద్ద చేసుకుని జంతికల గిద్దలో పెట్టి
కాగిన నూనెలో వత్తుకోవాలి.
రెండువైపులా వేయించి తీసుకోవాలి.
చిన్నటిప్: మొత్తం పిండి ఒక్కసారే ముద్దగా కలిపి వండితే కారప్పూస
ఎర్రగా వస్తుంది,అందుకని ప్రతిసారీ వత్తేముందు కొంచెం కొంచెంగా
కలుపుకోవాలి.
1 comments:
Naku chala ishtam karapposa :) Manchi tip chepparu thanx :)
Post a Comment