Thursday, October 20, 2011

చోలే - బటూరే

అందరూ ఇష్టపడే పాపులర్ బ్రేక్ ఫాస్ట్ ఐటం ఇది. చోలే కర్రీతో సాఫ్ట్ గా 

ఉండే బటూరాలు చాలా రుచిగా ఉంటాయి.






కావలసిన పదార్ధాలు:


మైదా పిండి                     రెండు కప్పులు 

బొంబాయిరవ్వ                 ఒక టేబుల్ స్పూన్ 

పెరుగు                          రెండు టేబుల్ స్పూన్స్

బేకింగ్ పౌడర్                   ఒక టీ స్పూన్ 

పంచదార                        అర టీ స్పూన్ 

ఉప్పు,నూనె 


తయారు చేసే విధానం:


మైదాపిండి,బేకింగ్ పౌడర్ కలిపి జల్లించుకోవాలి.పిండిలో అన్నీ కలిపి 

చపాతీ పిండిలా సాఫ్ట్ గా ముద్ద చేసుకుని ఒక అరగంట నాననివ్వాలి.

ఇప్పుడు ఒకసారి బాగా మర్దించి చిన్న చిన్న ఉండలు చేసి పూరీలు 

వత్తుకోవాలి.

కాగిన నూనెలో దోరగా వేయించి చోలేకూరతో వడ్డించాలి.


చోలే ఆలూ మసాలా :


చోలే                                      రెండు కప్పులు

ఆలూ                                     రెండు 

ఉల్లిపాయలు                              రెండు 

మిర్చి                                     రెండు 

కరివేపాకు                                ఒక రెమ్మ 

కొత్తిమీర                                  ఒక కట్ట

టమాటాలు                               రెండు 

అల్లం వెల్లుల్లి ముద్ద                     ఒక టీ స్పూన్

చోలేమసాలా పొడి                      ఒక  టీ స్పూన్

నూనె                                    రెండు టేబుల్ స్పూన్స్ 

ఉప్పు ,కారం,పసుపు

లవంగాలు, చెక్క, యాలకులు, బిర్యానిఆకు, జీలకర్ర 


తయారు చేసే పధ్ధతి :


శనగలను నానబెట్టుకోవాలి 

నూనె వేడిచేసి నాలుగు లవంగాలు,చిన్న దాల్చినచెక్క, రెండు 

యాలకులు, బిర్యానీ ఆకు వేయాలి.

సన్నగా తరిగిన ఉల్లిముక్కలు,మిర్చి,కరివేపాకు వేసి దోరగా 

వేయించాలి.  

అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేగిన తరువాత టమాటాముక్కలు వేయాలి.

ఇప్పుడు పసుపు,కారం వేసి ఆలూ ముక్కలు చోలే కూడా వేసి కలపాలి.

తగినంత ఉప్పు వేసి ఒక గ్లాస్ నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టి 

ఏడెనిమిది విజిల్స్ రానివ్వాలి.

స్టీం పోయాక చోలేమసాలా పొడి,కొత్తిమీర వేసి కొంచెం చిక్కబడ్డాక 

స్టవ్ ఆఫ్ చెయ్యాలి.ఆలూ వెయ్యడం వలన గ్రేవీ బాగా వస్తుంది.






Share/Bookmark

6 comments:

శిశిర

ఫోటో చూస్తుంటేనే నోరూరుతూందండీ. :) మీ ప్రెజెంటేషన్ చాలా బాగుంటుంది.

Subrahmanya Sarma

మా కాలేజిలో అస్తమాటూ ఇవి, చేసేసి., చావగొడుతూ ఉంటారు...! మిగతా నార్త్‌ వాళ్ల దగ్గర, మా ఇంటి దగ్గర భోజనం గురించి గొప్పగా చెప్తూ, ఊదరగొట్టేస్తున్నాం..! మీరిప్పుడు, తెలుగులో రాసేస్తున్నారు.. కొంపదీసి, మనవైపు ఇళ్లలో మొదలెడితే, అమ్మో..! ఉహించుకుంటేనే భయమేస్తోంది..!

మాలా కుమార్

బటూరాలు పూరీలా వత్తేకన్నా చిన్న పిండి ముద్దను రెండు చేతుల తో తిప్పుతూ చేస్తే చాలా బాగుంటాయి . నేను అలాగే చేస్తాను .

కృష్ణప్రియ

ఏ వంటైనా ఇంత ఈజీ యా అన్నట్టు చెప్తారు మీరు. బాగుంది.

లత

థాంక్యూ శిశిరా

గీతగారూ అక్కడ రోజూ అవే తింటున్నారు కనుక అలా ఉంది,ఇంట్లో చేసేది ఎప్పుడన్నా ఒకసారి చేస్తాము కనుక నో ప్రాబ్లం

లత

థాంక్యూ మాలగారూ,ఈ సారి నేనూ మీలాగా చేస్తాను

కృష్ణప్రియగారూ థాంక్యూ

Post a Comment

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP