Thursday, November 3, 2011

పనీర్ - స్వీట్ కార్న్ టోస్ట్

స్వీట్ కార్న్,పనీర్ కలిపి చేసే ఈ టోస్ట్ వెరైటీగా ఉంటుంది.ఉదయం 

బ్రేక్ ఫాస్ట్ కైనా, ఈవెనింగ్ స్నాక్స్ గా అయినా బావుంటుంది.








కావలసిన పదార్ధాలు :


బ్రెడ్                               నాలుగు స్లైసులు 

స్వీట్ కార్న్                       ఒక కప్పు 

పనీర్                             అర కప్పు 

ఉల్లిపాయ                         ఒకటి 

మిర్చి                             రెండు 

కొత్తిమీర                          కొంచెం

ఉప్పు,మిరియాలపొడి,చీజ్,టమాటాసాస్, 

ఒక టీ స్పూన్ వెన్నలేదా నెయ్యి  


తయారు చేసే విధానం:


స్వీట్ కార్న్ ఉడికించి కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి.

ఇందులోతురిమిన పనీర్ సన్నగా తరిగిన ఉల్లిపాయ,మిర్చి,కొత్తిమీర,

ఒక టేబుల్ స్పూన్ టమాటాసాస్,ఉప్పు,మిరియాలపొడి వేసి బాగా 

మిక్స్ చెయ్యాలి.

బ్రెడ్ పైన  కొంచెం వెన్న, నెయ్యి రాసి కార్న్ మిశ్రమం సర్దాలి 

మైక్రోవేవ్  కన్వెక్షన్ మోడ్ లో 200 డిగ్రీలకు ప్రీహీట్ చెయ్యాలి.

ఇప్పుడు కార్న్ మిశ్రమం మీద చీజ్ వేసి అయిదారు నిముషాలు లేదా 

చీజ్ కరిగేవరకు బేక్  చెయ్యాలి.

టమాటా సాస్ తో వేడిగా తింటే క్రిస్పీగా బావుంటాయి.  

                


Share/Bookmark

2 comments:

ఇందు

వావ్! చూస్తుంటేనే తినేయాలనిపిస్తోంది. హమ్మా!ఆ బ్రెడ్ టోస్ట్ కి కొద్దిరోజులు సెలవులిచ్చేసి ఇక దీనిమీద పడతాం ;) కాని ఒకటే బాధ! పనీఎర్ ఎక్కువగా తినము :((( పోన్లే వీకెండ్స్ లాగించేస్తా!! :)))

లత

ఎప్పుడైనా ఒకసారి తినొచ్చులే ఇందూ పర్లేదు
అంతగా అయితే పనీర్ పావుకప్పు వెయ్యండి

Post a Comment

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP