బ్రెడ్ రోల్స్
పిల్లలు చాలా ఇష్టంగా తినే స్నాక్ ఈ బ్రెడ్ రోల్స్.కూర రెడీగా ఉంటే
అయిదు నిమిషాల్లో చేసిపెట్టొచ్చు.లోపల ఫిల్లింగ్ మన ఇష్టం.ఆలూ
కర్రీ,మిక్స్డ్ వెజ్ కర్రీ,పనీర్,కాలీఫ్లవర్ ఇలా ఏ కూర అయినా వాడొచ్చు.
కావలసిన పదార్ధాలు :
బ్రెడ్ నాలుగు స్లైసులు
ఆలూ కర్రీ ఒక కప్
నూనె,టమాటా సాస్
తయారు చేసే విధానం;
బ్రెడ్ స్లైసెస్ అంచులు కట్ చేసుకోవాలి.
ఒక బౌల్ లో నీళ్ళు తీసుకుని బ్రెడ్ ను వేసి వెంటనే తీసి అరచేతుల
మధ్య ఉంచి నొక్కి నీళ్ళు వత్తెయ్యాలి.
స్లైస్ మధ్యలో కూర పెట్టి రోల్ లాగా చెయ్యాలి.ఇలా అన్నిరోల్స్ రెడీ
చేసుకుని కాగిన నూనెలో ఎర్రగా వేయించి తీయాలి.
వేడిగా టమాటా సాస్ తో తింటే బావుంటాయి.
3 comments:
ఈ నెలలొ 10 కంప్లీట్ చెయ్యలేరేమో అని టెన్షన్ గా ఉందండి. కాస్త త్వరగా రాయండి లత గారు. మీ డిసిప్లెన్ రికార్డ్ ఆగిపొకూడదు.
నేనూ అదే అనుకుంటున్నాను మంచుగారూ,తప్పకుండా ప్రయత్నిస్తాను.
మీ అభిమానానికి ధన్యవాదాలు.
వావ్! ఇంకో బ్రెడ్ ఐటం. ఇది ఎలా మిస్ అయ్యనబ్బా?????? :))
Post a Comment