పొంగలి
మంచి హెల్దీ బ్రేక్ ఫాస్ట్ ఐటం ఇది.ఇందులోకి కొబ్బరి పచ్చడి మంచి
కాంబినేషన్.వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది.
కావలసిన పదార్ధాలు :
బియ్యం రెండు కప్పులు
పెసరపప్పు ఒక కప్పు
కరివేపాకు ఒక రెమ్మ
అల్లం చిన్న ముక్క
ఉప్పు తగినంత
నెయ్యి,నూనె
తాలింపుకు కాజూ,శనగపప్పు,ఆవాలు,జీలకర్ర,మిరియాలు,ఎండుమిర్చి
తయారు చేసే పధ్ధతి :
పెసరపప్పును దోరగా వేయించి బియ్యంతో కలిపి కడిగి పెట్టుకోవాలి.
ప్రెషర్ పాన్ లో రెండు స్పూన్స్ నెయ్యి,రెండు స్పూన్స్ నూనె వేడిచేసి
తాలింపు వెయ్యాలి.దోరగా వేగిన తరువాత కరివేపాకు,సన్నగా తరిగిన
అల్లం ముక్కలు వేసి వేయించాలి.
ఇప్పుడు బియ్యం, పెసరపప్పు వేసి రెండు నిముషాలు వేయించి నీళ్ళు,
తగినంత ఉప్పు వేసి కలపాలి.
సగం ఉడికిన తరువాత మూతపెట్టి నాలుగు విజిల్స్ రానివ్వాలి.వెంటనే
మూత పెట్టేస్తే నీరు పొంగిపోతుంది
స్టీం పోయిన తరువాత ఒకసారి బాగా కలిపి కొబ్బరిపచ్చడితో వడ్డించాలి.
నోట్: తాలింపులో మిరియాలు,జీలకర్ర ఎక్కువ వేస్తే ఆ ఫ్లేవర్స్ తో
స్పైసీగా బావుంటుంది.
అలాగే గ్లాసున్నర(బియ్యం,పెసరపప్పు)కు నేను అయిదు గ్లాసుల
నీళ్ళు పోశాను.పొంగలి బాగా మెత్తగా జారుగా కావాలి అంటే ఇంకా
ఎక్కువ వాడొచ్చు.
3 comments:
Inkoka recipe ... Ee roje rayaali meeru.. :-)
తప్పకుండా రాస్తానండీ.థాంక్యూ వెరీమచ్
ur recipe worked so well.. thank you...
Post a Comment