Friday, October 28, 2011

పూర్ణాలు

పండుగైనా,శుభకార్యమైనా తప్పనిసరిగా చేసుకునే తీపి వంట ఈ 

పూర్ణాలు.వీటినే కొందరు బూరెలు అంటారు.








కావలసిన పదార్ధాలు:


శనగపప్పు                         ఒక గ్లాస్ 

బెల్లం                              ఒకటిన్నర గ్లాస్ 

పంచదార                          అర గ్లాస్ 

పచ్చికొబ్బరి                       ఒక కప్పు

ఇలాచీపొడి                       ఒక టీ స్పూన్ 


పూతపిండి కోసం 


మినప్పప్పు                       ఒక  గ్లాస్ 

బియ్యం                          రెండు గ్లాసులు 

ఉప్పు,నూనె




తయారు చేసేవిధానం:


మినప్పప్పు,బియ్యం అయిదారుగంటలు నానబెట్టి మెత్తగా 

రుబ్బుకోవాలి.

ఈపిండిని కొంచెం పొంగేవరకు ఉంచి,తగినంత ఉప్పు కలిపి అప్పుడు 

పూర్ణాలు వండితే పైపూత  కూడా మృదువుగా ఉంటుంది.



పూర్ణం తయారు చేయడానికి 


శనగపప్పు మెత్తగా ఉడికించాలి.ఇందులో తరిగిన బెల్లం,పంచదార,

కొబ్బరితురుము కలిపి బాగా దగ్గరయ్యేవరకు ఉడికించాలి.

ఇందులో ఇలాచీపొడి వేసి కలిపి చల్లారనివ్వాలి.

ఈమిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలు చేసి వీటిని పిండిలో ముంచి కాగిన 

నూనెలో వేసి దోరగా వేయించుకోవాలి.





Share/Bookmark

2 comments:

కృష్ణప్రియ

అయితే దోశల పిండి పై పూత అన్నమాట.

లత

అవునండి,
లేదా ఇలా కూడా చెయ్యొచ్చు రెండుకప్పులు బియ్యంపిండిని కొంచెం జారుగా కలిపి అందులో ఒకకప్పు మినప్పప్పును మెత్తగా రుబ్బి కలుపుకొవాలి. ఇలా అయితే పిండి ఒక గంట నానితే చాలు.
కాకపోతే ఇలా వండితే పూర్ణాలు కొంచెం ఎర్రగా వస్తాయి.

Post a Comment

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP