Monday, October 24, 2011

బొబ్బట్లు

పండగలు అంటేనే స్పెషల్స్,పిండివంటలు తప్పనిసరి.అందులో బాగమే 

ఈ తియ్య తియ్యని బొబ్బట్లు.వీటినే భక్ష్యాలు అని కూడా అంటారు.









కావలసిన పదార్ధాలు 


మైదాపిండి                         రెండు కప్పులు 

వెన్నపూస                         రెండు టేబుల్ స్పూన్స్ 

 ఉప్పు                               చిటికెడు 

నూనె                              ఒక టీ స్పూన్ 



శనగపప్పు                         ఒక గ్లాస్ 

బెల్లం                              ఒకటిన్నర గ్లాస్ 

పంచదార                          అర గ్లాస్ 

పచ్చికొబ్బరి                       ఒక కప్పు

ఇలాచీపొడి                       ఒక టీ స్పూన్


 తయారు చేసేవిధానం:


శనగపప్పు మెత్తగా ఉడికించాలి.ఇందులో తరిగిన బెల్లం,పంచదార,

కొబ్బరితురుము కలిపి బాగా దగ్గరయ్యేవరకు ఉడికించాలి.

ఇందులో ఇలాచీపొడి వేసి కలిపి చల్లారనివ్వాలి.

ఈలోగా మైదాపిండిలో ఉప్పు,వెన్నపూస కలిపి తగినన్ని నీళ్ళతో 

చపాతీపిండిలా మృదువుగా కలపాలి.ఈ పిండికి కొంచెం నూనె రాసి 

ఒక గంట నాననివ్వాలి.

ఇప్పుడు నానిన పిండిని చిన్న ఉండ తీసుకుని  కొంచెం వత్తి మధ్యలో 

శనగపప్పు మిశ్రమాన్ని పెట్టి అన్నివైపులా మూసి ఉండ చేసుకోవాలి.

దీన్ని పలుచని చపాతీలా వత్తి తవాపై  రెండువైపులా నేతితో కాల్చాలి.



Share/Bookmark

2 comments:

కృష్ణప్రియ

బాగుంది.

అన్నట్టు ఒకటి గమనించా.. ఈ సంవత్సరం అంతా.. చాలా పధ్ధతి గా నెలకి పది కి ఎక్కువా తక్కువా కాకుండా మీరు టపాలు రాస్తున్నారని. ఈ వారం లో మీరింకా నాలుగు రాస్తారన్నమాట.. అంతేనా?

లత

ఇలా నెలకి పది రాయాలనే అనుకుంటున్నాను కృష్ణప్రియ గారూ
చూద్దాం

Post a Comment

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP