కారట్ - పెసరపప్పు ఫ్రై
కారట్ తురుము,స్ప్రింగ్ ఆనియన్స్,పెసరపప్పు కలిపి చేసే ఈ కూర
చాలా త్వరగా అయిపోతుంది.రైస్ లోకి బావుంటుంది.
కావలసిన పదార్ధాలు:
కారట్ తురుము ఒక కప్
పెసరపప్పు ఒక కప్
ఉల్లికాడలు ఒక కప్
మిర్చి రెండు
కరివేపాకు ఒక రెమ్మ
ఉప్పు,కారం తగినంత
పసుపు చిటికెడు
నూనె రెండు టీస్పూన్స్
గరంమసాలాపొడి పావు టీస్పూన్
తాలింపుకు శనగపప్పు,ఆవాలు,జీలకర్ర,వెల్లుల్లిరెబ్బలు
తయారు చేసే విధానం:
పెసరపప్పు కొంచెం ఉడికించి వార్చాలి.
నూనె వేడిచేసి తాలింపు వేసి సన్నగా తరిగిన మిర్చి,ఉల్లికాడలు,
కారట్ తురుము వేసి పచ్చిదనం పోయేవరకూ వేగనివ్వాలి,
కారట్ తురుము వేసి పచ్చిదనం పోయేవరకూ వేగనివ్వాలి,
ఇప్పుడు ఉడికించిన పెసరపప్పు వేసి బాగా కలిపి వేయించాలి,
ఉప్పు,కారం,పసుపు వేసి బాగా వేయించి చివరగా గరంమసాలాపొడి
చల్లాలి.ఉల్లికాడల బదులు కొత్తిమీర వేసినా బావుంటుంది.
2 comments:
speed gaa ayipotundi kadaa.taste koda baaguntundi.
అవును శశిగారు
Post a Comment