మలై లడ్డు
అందరికీ దీపావళి శుభాకాంక్షలు.
పండుగ కదా.వెరైటీ స్వీట్ చేసుకుంటే బావుంటుంది.సింపుల్ గా
చాలా తక్కువ పదార్ధాలతో అయిదు నిమిషాల్లో రెడీ అయ్యే ఈ లడ్డు
రుచి కూడా చాలా బావుంటుంది.
రుచి కూడా చాలా బావుంటుంది.
కావలసిన పదార్ధాలు :
పనీర్ రెండు కప్పులు
మిల్క్ మెయిడ్ ఒక కప్పు
నెయ్యి ఒక టీ స్పూన్
ఇలాచీపొడి పావు టీ స్పూన్
కాజూ,బాదం
తయారు చేసే విధానం:
పనీర్ ను తురుముకోవాలి.
ఒక నాన్ స్టిక్ పాన్ లో పనీర్ తురుము,మిల్క్ మెయిడ్ వేసి బాగా
కలపాలి.
కలపాలి.
ఈ మిశ్రమాన్ని సన్నని సెగపై కలుపుతూ ఉడికించాలి.కొంచెం
దగ్గరవుతుండగా నెయ్యి,సన్నగా కట్ చేసిన కాజు,బాదం,ఇలాచీపొడి
వేయాలి.
దగ్గరవుతుండగా నెయ్యి,సన్నగా కట్ చేసిన కాజు,బాదం,ఇలాచీపొడి
వేయాలి.
ముద్దగా వస్తున్నప్పుడు దించేసి బాగా చల్లారిన తరువాత లడ్డూలు
చేసుకోవాలి.ఇవి కొంచెం సాఫ్ట్ గా ఉంటాయి కాబట్టి పేపర్ కప్స్ లో
పెట్టి సర్వ్ చేస్తే బావుంటుంది.
2 comments:
wow!! bhale unnay norooripotondi :) meeku happy diwali latha garu :)
థాంక్యూ ఇందూ
Post a Comment