జీడిపప్పు పాకం
ఈ బ్లాగ్ లో ఇది 100 వ పోస్ట్.నిజంగా చాలా ఆనందంగా ఉంది.
సరదాగా మొదలుపెట్టిన బ్లాగ్ ఎన్ని అనుభూతులు మిగిల్చిందో
మాటల్లో చెప్పలేను.నచ్చినవాటికి కామెంట్స్ పెట్టి ఆదరించిన మీ
అందరికీ థాంక్ యూ వెరీమచ్.
ఈ సందర్భంగా మావారికి స్పెషల్ గా థాంక్స్ చెప్పుకోవాలి.ఈ బ్లాగ్
కోసమే కెమేరా కొనుక్కొచ్చి గిఫ్ట్ గా ఇచ్చి ప్రోత్సహించినందుకు.
వందవ పోస్ట్ కాబట్టి కొంచెం స్పెషల్ గా ఈస్వీట్.జీడిపప్పు
పాకం చేయడం చాలా తేలిక.ఇదే బయట కొనాలంటే చాలా కాస్ట్లీగా
ఉంటుంది.ఒక్క పావుగంట కష్టపడితే సింపుల్ గా కాజూ వేయించుకుని
పాకం పట్టేసుకోవచ్చు.
పాకం చేయడం చాలా తేలిక.ఇదే బయట కొనాలంటే చాలా కాస్ట్లీగా
ఉంటుంది.ఒక్క పావుగంట కష్టపడితే సింపుల్ గా కాజూ వేయించుకుని
పాకం పట్టేసుకోవచ్చు.
కావలసిన పదార్ధాలు:
జీడిపప్పు పావుకిలో
బెల్లం ఒక కప్
పంచదార అర కప్
నెయ్యి మూడు టీ స్పూన్స్
ఇలాచీ పొడి అర స్పూన్
తయారు చేసే విధానం :
నెయ్యి వేడి చేసి జీడిపప్పును దోరగా వేయించుకోవాలి.
బెల్లం,పంచదార కొంచెం నీళ్ళు పోసి ,కరిగిన తరువాత వడపోసుకోవాలి
తిరిగి స్టవ్ మీద పెట్టి ఉండ పాకం రానివ్వాలి.కొంచెం పాకం నీళ్ళల్లో
వేస్తే ఉండలా ఫాం అవుతుంది
ఇప్పుడు ఇలాచీ పొడి వేసి స్టవ్ ఆఫ్ చెయ్యాలి.వేయించిన జీడిపప్పును
పాకంలో వేసి బాగా కలపాలి.
ఒక ప్లేట్ లో కొంచెం నెయ్యి రాసి అచ్చు పోసెయ్యాలి.
ఒక ప్లేట్ లో కొంచెం నెయ్యి రాసి అచ్చు పోసెయ్యాలి.
ఆరాక కదిపితే అచ్చు వచ్చేస్తుంది.దీన్ని ముక్కలు చేసుకుని స్టోర్
చేసుకోవాలి. ఎంతో రుచిగా ఉండే జీడిపప్పు పాకం నిమిషాల్లో రెడీ
అయిపోతుంది
12 comments:
అభినందనలండి. చక్కగా ప్లాన్ చేసి రకరకాల ఐటెమ్స్ పరిచయం చేస్తున్నారు. మీరు మరిన్ని టపాలు రాయాలని కోరుకుంటున్నాను.
లత గారూ..
అభినందనలు.. అన్నీ వంటల బ్లాగుల్లా రొటీన్ గా కాకుండా మీ బ్లాగ్ ప్రత్యేకంగా అనిపిస్తుంది నాకు.. వంద రోజుల పండగ సందర్భంగా జీడిపప్పు పాకం అన్నమాట మా కోసం.. స్వీట్లు తక్కువ తినే నాకు చాలా చాలా ఇష్టమైన స్వీట్ ఇది.. :))
మీరింకా వందల వందల రెసిపీలు మాకు చెప్పాలని మా మనవి.. :)
కంగ్రాచ్యులేన్స్ లతగారు, నాకు చాలా ఇష్టమైన స్వీట్ ఇది కాని భయమేస్తుంది... మీరు ఇంకా ఇంకా వెరైటీ వంటకాలు చేసి మాకు చూపించాలని. మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా చేసిపెడతారని కోరుకుంటున్నాను. మా ఇంటికి వస్తే నేను చేసిపెడతానుగా..
అభినందనలు
మీ బ్లాగ్ నేను ఫేవరెట్స్లో ఏడ్ చేసుకుని వంటలు ట్రై చేస్తూ ఉంటాను..చాలా బాగా రాస్తున్నారు.. గుడ్ గుడ్
అమ్మో! వంద వంటకాలే. సో గ్రేట్. మీరు చెప్పిన కొన్ని అయిటెంస్ చేసాను. చాలా బాగా కుదిరాయి. Congrats for century.
Congrats. We expect 900 more posts from you.
శిశిరా,మధురా అలాగే రాస్తాను
జ్యోతిగారు,తప్పకుండా చేసిపెడతానండి.
నేస్తంగారు,జయగారు
మీ అందరి అభినందనలకు ధన్యవాదాలండి.థాంక్యూ వెరీమచ్
కృష్ణగారు
అమ్మో చాలా పెద్ద టార్గెట్ పెట్టారు మీరు
థాంక్యూ వెరీమచ్
అభినందనలు...లత గారు.మరి ఈ సందర్బన్గా పొటొ లొది
కొంచం పెట్టే యెర్పాటు చెయగలరు.
శశిగారు,థాంక్యూ
అలాగేనండి మరీ కొంచెమేనా
లతగారూ అభినందలు :) ఈమధ్య అస్సలు నెట్లోకి రాక మీ బ్లాగులోకి రాలేకపోతున్నా :(( సారీ! కానీ మీ వంటల బ్లాగ్ మాత్రం అన్ని వంటలబ్లాగులకి హైలైట్! ఎంత ఓపిగ్గా....అన్నీ ఎంతో అందంగా,నోరూరేలాగా అలంకరిస్తారు కూడా! ఇంకా మీ బ్లాగులో నాకు నచ్చేదేవిటంటే....అన్నీ సింపుల్గా అయిపోయేలా చెప్తారు.గంటలు గంటలు చేసే వంటలకి,అలాగె తలాతోకా తెలియని పదార్ధాల్తో చేసే వంటలకి మీ బ్లాగులో వంటలు చాల దూరం :) అందుకే మీది ఇంత సక్సెస్ అయింది. మీరు ఈ వందటపాలు లాగే....బోలెడు శతటపోత్సవాలు చేసుకోవాలని మీ దయవల్ల నాకు వంట బాగ రావాలని గట్టిగా దేవుడ్ని కోరేసుకుంటున్నా ;)
ఇందూ,
థాంక్యూ వెరీమచ్.
Post a Comment