టమాటా పెప్పర్ చికెన్
చికెన్ తో ఎన్ని రకాల వెరైటీలు అయినా ఈజీగా చేసెయ్యొచ్చు
టమాటా,మిరియాలపొడి వేసి చేసే ఈ కర్రీ కొంచెం స్పైసీగా అన్నంలోకి
అయినా,చపాతీ లోకి అయినా బావుంటుంది.
కావలసిన పదార్దాలు :
చికెన్ పావుకిలో
ఉల్లిపాయ ఒకటి
టమాటా ఒకటి
మిర్చి రెండు
కరివేపాకు ఒక రెమ్మ
అల్లంవెల్లుల్లి ముద్ద ఒక టీ స్పూన్
గరం మసాలా పొడి ఒక టీ స్పూన్
కొత్తిమీర కొంచెం
మిరియాలపొడి రెండు టీ స్పూన్స్
పసుపు కొంచెం
ఉప్పు,కారం తగినంత
నూనె రెండు టేబుల్ స్పూన్స్
తయారు చేసే విధానం:
నూనె వేడిచేసి సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు,మిర్చి,కరివేపాకు
వేసి దోరగా వేయించాలి.
అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేగిన తరువాత టమాటా ముక్కలు వేసి
వేయించాలి.
ఇప్పుడు చికెన్ వేసి కలిపి మూతపెట్టి సన్నని సెగపై ఉడికించాలి.కొంచెం
ఉడికిన తరువాత పసుపు,కారం,ఉప్పు,వేసి కొంచెం నీరు పోయాలి.
చికెన్ మెత్తగా ఉడికిన తరువాత గరంమసాల పొడి,మిరియాలపొడి,
కొత్తిమీర వేసి కలిపి బాగా ఫ్రై చెయ్యాలి.ఒక బౌల్ లోకి తీసుకుని
కొత్తిమీర చల్లి ఉల్లి చక్రాలతో అలంకరించుకోవాలి.
0 comments:
Post a Comment