మసాలా పోహా
అటుకులతో వంట అనగానే ఉప్మా,పులిహోర ఎక్కవగా చేస్తుంటాము.
కొంచెం వెరైటీగా పులావ్ లాగా కూరగాయముక్కలు,మసాలా వేసి చేస్తే
చాలా రుచిగా ఉంటుంది.సాయంత్రం పూట అయినా,రాత్రిపూట టిఫిన్
లాగా చేసుకున్నా కూడా ఓకే. త్వరగా అయిపోతుంది
కావలసిన పదార్ధాలు :
అటుకులు రెండు కప్పులు
ఉల్లిపాయ ఒకటి
మిర్చి మూడు
ఆలూ ఒకటి
కారట్ ఒకటి
టమాటా ఒకటి
అల్లంవెల్లుల్లి ముద్ద అర స్పూన్
గరం మసాల పొడి అర స్పూన్
కరివేపాకు ఒక రెమ్మ
కొత్తిమీర అర కట్ట
పల్లీలు ,జీడిపప్పు కొంచెం
నూనె,ఉప్పు తగినంత
పసుపు చిటికెడు
నిమ్మకాయ ఒకటి
తాలింపుకు శనగపప్పు,ఆవాలు ,జీలకర్ర,ఎండుమిర్చి
తయారు చేసే విధానం :
ముందుగా అటుకులు కడిగి నీరు వంపేసి పెట్టుకోవాలి
నూనె వేడిచేసి తాలింపు వేసి జీడిపప్పు,కరివేపాకు కూడా వేసి దోరగా
వేయించాలి.
సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి,ఆలూ.కారట్ తురుము వేసి వేయించాలి.
ఆలూ ఉడికిన తరువాత తరిగిన టమాట వేసి మగ్గనివ్వాలి.
ఇప్పుడు అల్లంవెల్లుల్లిముద్ద ,పసుపు,గరంమసాలపొడి వేసి బాగా కలిపి
మెత్తబడ్డ అటుకులను,తగినంత ఉప్పు కలిపి రెండునిమిషాలు సన్నని
సెగపై ఉంచాలి .
చివరిగా తరిగిన కొత్తిమీర వేసి కలిపి దించెయ్యాలి.నిమ్మరసం పిండి ఒక
బౌల్ లోకి తీసుకుని వేయించిన పల్లీలు,జీడిపప్పుతో అలంకరించి వేడిగా
సర్వ్ చయ్యాలి.
ఇష్టం ఉంటే ఇందులో ఇంకా కాప్సికం,బీన్స్,బటానీ ఇవి కూడా
వేసుకోవచ్చు.
3 comments:
Wowww! Chala bagundi :)
థాంక్స్ ఇందూ
mumbai lo poha maku suparichitam...
Post a Comment