Friday, June 17, 2011

కాబేజ్ - ఎగ్ ఫ్రై

కాబేజ్ ఆరోగ్యానికి మంచిది.కానీ అంతగా నచ్చదు ఎవరికీ.అందుకే 

రకరకాల వెరైటీలు చెయ్యడం తప్పనిసరి.వాటిలో చాలా ఇష్టంగా తినే 

ఐటం ఎగ్స్ తో కలిపి చేసే ఈ ఫ్రై.అన్నంలోకి,చపాతిలోకి కూడా ఇది 

బావుంటుంది





కావలసిన పదార్ధాలు:


కాబేజ్                                       పావుకిలో 

ఎగ్స్                                         రెండు 

ఉల్లిపాయ                                   ఒకటి

మిర్చి                                       మూడు 

అల్లంవెల్లుల్లి ముద్ద                      ఒక టీస్పూన్

గరంమసాల పొడి                        ఒక టీ స్పూన్ 

ఉప్పు,కారం                                తగినంత 

పసుపు                                    చిటికెడు 

నూనె                                       రెండు టేబుల్ స్పూన్లు

కొత్తిమీర                                    కొంచెం 

కరివేపాకు                                 ఒక రెమ్మ 

తాలింపుకు 

శనగపప్పు,మినప్పప్పు,ఆవాలు,జీలకర్ర,ఎండుమిర్చి


తయారు చేసే విధానం;


కాబేజ్ ను సన్నగా తరిగి కుక్కర్ లో వేసి ఒక విజిల్ రానివ్వాలి.ఇంకా 

ఎక్కువ విజిల్స్ రానిస్తే మెత్తగా అయిపోయి కూర బావుండదు. 

నూనె వేడి చేసి తాలింపు వేసి సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి,కరివేపాకు 

వేసి దోరగా వేయించాలి.

అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి పచ్చివాసన పోయాక కాబేజ్ వేసి 

ఉప్పు,పసుపు వేసి నీరు ఇగిరిపోయేవరకు బాగా వేయించాలి.

ఇప్పుడు కారం వేసి కలిపి దగ్గరయ్యాక,ఎగ్స్ బ్రేక్ చేసి వేయాలి,

ఒకసారి కలిపి సిమ్ లో ఉంచి ఉడకనివ్వాలి.ఎగ్స్ ఉడికాక గరం

మసాలపొడి,కొత్తిమీర వేసి కలిపి కొంచెం వేగాక స్టవ్ ఆఫ్ చెయ్యాలి.

ఒక బౌల్ లోకి తీసుకుని కొత్తిమీర చల్లాలి.



Share/Bookmark

0 comments:

Post a Comment

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP