చక్రపొంగలి
తియ్యగా కమ్మగా నేతితో ఘుమఘుమలాడిపోయే చక్రపొంగలి అంటే
అందరికీ ఇష్టమే.సంసారంఒకచదరంగం సినిమాలో గొల్లపూడి అంటారు
అసలు చక్రపొంగలి అంటే నెయ్యి టప్పూటప్పూమని కారాలి అప్పుడే
రుచి అని.ఆరోగ్యరీత్యా ఆ లెవెల్లో కాకపోయినా,కాస్త ఎక్కువ వేస్తేనే
కమ్మని రుచి వస్తుంది .
కావలసిన పదార్ధాలు:
బియ్యం ఒక కప్
పెసరపప్పు అర కప్
పాలు ఒకటిన్నర కప్
నీళ్ళు ఒకటిన్నర కప్
బెల్లం రెండు కప్పులు
పంచదార ఒక కప్
నెయ్యి తగినంత
కాజూ,కిస్మిస్,బాదాం,ఎండుకొబ్బరి ముక్కలు
తయారు చేసే విధానం:
ముందుగా పెసరపప్పును దోరగా వేయించుకోవాలి.
బియ్యం,పెసరపప్పు కడిగి పాలు,నీళ్ళు పోసి కుక్కర్లో వండుకోవాలి.
కొంచెం నెయ్యి వేడిచేసి కాజూ,కిస్మిస్,ఎండుకొబ్బరి ముక్కలు వేయించి
తీసుకోవాలి.
ఇప్పుడు ఉడికిన అన్నంలో తరిగిన బెల్లం,పంచదార వేసి బాగా కలిపి ,
అంతా కరిగి పాకం వచ్చేవరకూ ఉడికించుకోవాలి.
కొంచెం చిక్కబడుతుండగా నెయ్యి పోసి కలుపుతూ దగ్గరయ్యాక స్టవ్
ఆఫ్ చెయ్యాలి.
వేయించిన కాజూ,కిస్మిస్ ఎండుకొబ్బరి ముక్కలు కలిపితే కమ్మని
చక్రపొంగలి రెడీ అవుతుంది.
1 comments:
bhale undi :) naku chala ishtam idi :) Thnx ee friday chesta chakra pongali :)
Post a Comment