ఇన్ స్టెంట్ ఎగ్ ఊతప్పం
ఈజీగా చాలా త్వరగా అయిపోయే బ్రేక్ ఫాస్ట్ ఇది.నేనూ మొదటిసారి ట్రై
చేశాను.చాలా నచ్చింది.సాస్ తో కూడా బావుంది కానీ, కొబ్బరిచట్నీతో
చట్నీతో ట్రై చేస్తాను.
కావలసిన పదార్ధాలు:
బొంబాయిరవ్వ ఒక కప్
బియ్యంపిండి రెండు కప్పులు
పెరుగు ఒక కప్
ఉల్లిపాయ ఒకటి
మిర్చి మూడు
కారట్ ఒకటి
టమాట ఒకటి
కరివేపాకు ఒక రెమ్మ
కొత్తిమీర అర కప్పు
అల్లం చిన్న ముక్క
ఎగ్స్ రెండు
ఉప్పు తగినంత
మిరియాలపొడి ఒక స్పూన్
వంటసోడా పావు స్పూన్
నూనె
తయారు చేసే విధానం:
ముందుగా రవ్వ,బియ్యంపిండి ఒక బౌల్ లోకి తీసుకుని పెరుగు,ఉప్పు
వంటసోడా వేసి తగినన్ని నీళ్ళతో జారుగా కలుపుకుని ఒక అరగంట
నాననివ్వాలి.
నాననివ్వాలి.
ఉల్లి,మిర్చి,టమాట.అల్లం,కరివేపాకు,కొత్తిమీర అన్ని చాల సన్నగా
తరిగి ఉంచుకోవాలి.కారట్ తురుముకోవాలి.
ఎగ్స్ ఒక బౌల్ లోకి బ్రేక్ చేసి ఉప్పు,మిరియాలపొడి వేసి బీట్ చెయ్యాలి.
నాన్ స్టిక్ తవా వేడి చేసి కొంచెం పిండిని దోశలాగ వేయాలి.వేశాక
గరిటతో స్ప్రెడ్ చెయ్యడానికి రాదు.అందుకని తవాని గుండ్రంగా తిప్పితే
కొంచెం స్ప్రెడ్ అవుతుంది.ఊతప్పం కనుక కొంచెం మందంగా ఉన్నా
బాగానే ఉంటుంది.
ఇప్పుడు పైన తరిగిన ఉల్లి మిశ్రమాన్ని వేయాలి.చివరగా బీట్ చేసిన
ఎగ్ కూడా వేసి నూనె వేయాలి.
గరిటతో స్ప్రెడ్ చెయ్యడానికి రాదు.అందుకని తవాని గుండ్రంగా తిప్పితే
కొంచెం స్ప్రెడ్ అవుతుంది.ఊతప్పం కనుక కొంచెం మందంగా ఉన్నా
బాగానే ఉంటుంది.
ఇప్పుడు పైన తరిగిన ఉల్లి మిశ్రమాన్ని వేయాలి.చివరగా బీట్ చేసిన
ఎగ్ కూడా వేసి నూనె వేయాలి.
కొంచెం ఉడికాక జాగ్రత్తగా తిరగేసి రెండో వైపు కూడా కాలనివ్వాలి.
వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ ఊతప్పం.ఎగ్స్ తిననివారు
అది లేకుండా ఊతప్పంలా ట్రై చెయ్యొచ్చు.
అది లేకుండా ఊతప్పంలా ట్రై చెయ్యొచ్చు.
0 comments:
Post a Comment