స్వీట్ కార్న్ పకోడా
చల్లచల్లగా తొలకరి చినుకులు పడుతుంటే వేడివేడిగా తినాలనిపిస్తుంది.
ఎపుడూ వేసే పకోడీలే వెరైటీగా చేస్తే బావుంటుంది.స్వీట్ కార్న్ తో చేస్తే
కొంచెం స్పైసీగా, కొంచెం స్వీట్ ఫ్లేవర్ తో డిఫెరెంట్ గా ఉంటాయి.
కావలసిన పదార్ధాలు :
స్వీట్ కార్న్ ఒక కప్
శనగపిండి రెండు కప్పులు
బియ్యం పిండి ఒక కప్
ఉల్లిపాయ రెండు
పచ్చిమిర్చి అయిదు
అల్లం చిన్నముక్క
కరివేపాకు ఒక రెమ్మ
కొత్తిమీర ఒక కట్ట
వంట సోడా పావు స్పూన్
ఉప్పు తగినంత
నూనె
తయారు చేసే విధానం :
స్వీట్ కార్న్ లో కొంచెం నీరు పోసి మైక్రోవేవ్ లో రెండునిముషాలు
పెడితే ఉడికిపోతాయి
ఒక బౌల్ లోశనగపిండి,బియ్యంపిండి,ఉప్పు,వంటసోడా వేసుకోవాలి.
ఇందులో వాలికలుగా తరిగిన ఉల్లిపాయలు,సన్నగా తరిగిన మిర్చి,
ముద్దగా నూరి అయినా వేసుకోవచ్చు
అల్లం,కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి.అల్లం మిర్చి
చివరిగా ఉడికించిన కార్న్ ను వేసి తగినన్ని నీళ్ళతో పకోడీల పిండిలా
కలుపుకోవాలి.
నూనె కాగాక పకోడీలు వేసి గోల్డ్ కలర్ వచ్చేవరకూ వేయించి
తీసుకోవాలి .
టమాటా సాస్ తో వేడిగా సర్వ్ చేస్తే క్రిస్పీగా కార్న్ పకోడా రుచిగా
ఉంటాయి.
1 comments:
Very good. I tried it. Nice.
Post a Comment