గోంగూర - పప్పు
గోంగూర పచ్చడి ఎంతగా ఇష్టపడతామో కదా.అలాగే ఈ గోంగూర
శనగపప్పు కూర కూడా పుల్లగా కమ్మగా ఉంటుంది.వేడి వేడి అన్నంలో
నెయ్యి వేసుకుని ఈ కూరతో తింటే ఆ రుచే వేరు.
కావలసిన పదార్ధాలు:
శనగపప్పు ఒక కప్పు
గోంగూర మూడు కట్టలు
ఉల్లిపాయ ఒకటి
మిర్చి నాలుగు
ఉప్పు,కారం తగినంత
పసుపు పావు స్పూన్
కరివేపాకు రెండు రెమ్మలు
నూనె రెండు టేబుల్ స్పూన్లు
తాలింపుకు
శనగపప్పు,మినప్పప్పు,ఆవాలు,జీలకర్ర,ఎండుమిర్చి ,వెల్లుల్లి రెబ్బలు
తయారు చేసే విధానం:
శనగపప్పు కడిగి ఒక అరగంట నానబెట్టాలి.
ఇప్పుడు ఈ పప్పు,కడిగిన గోంగూర,తరిగిన ఉల్లిముక్కలు,మిర్చి అన్నీ
కలిపి కుక్కర్లో వేసి రెండు కప్పుల నీరు పోసి ఏడెనిమిది విజిల్స్
రానివ్వాలి.తక్కువ విజిల్స్ అయితే పులుపుకు పప్పు ఉడకదు.
తగినంత ఉప్పు,కారం,పసుపు వేసి చిక్కబడేదాకా ఉడికించాలి.
నూనె వేడి చేసి తాలింపు వేసి కూరలో వేయాలి.
వెల్లుల్లి రెబ్బలు,కరివేపాకు ఎక్కువ వేస్తే ఘుమఘుమలాడుతూ కూర
ఛాలా రుచిగా ఉంటుంది.
2 comments:
మీరు ఫొటోలు పెట్టడం...నాకు నోరు ఊరకపోవడం..జరుగునా???? ఎంత బాగుందండీ ఆ ఫొటో...ఇప్పుడె సిస్టంలోనించి లాగేసుకుని...అన్నంలో కలిపేసుకుని తినయెలనిపించేంత బాగుంది :)
థాంక్స్ ఇందూ
చాలా రోజుల తరువాత మీ కామెంట్
అంతగా నచ్చినందుకు మరో థాంక్స్.వెంటనే చేసెయ్యండి మరి
Post a Comment