బనానా చాక్లెట్ మిల్క్ షేక్
అరటిపండు,చాక్లెట్ కలిపి చేసే మిల్క్ షేక్ ఇది చాలా సింపుల్ గా రెండు
నిమిషాల్లో చేసి పిల్లలకి ఇచ్చేయ్యొచ్చు.కిట్ కాట్,ఫైవ్ స్టార్,కాడ్బరీ
ఇలా ఏ చాక్లెట్ అయినా వాడొచ్చు.
కావలసిన పదార్ధాలు
పాలు ఒక కప్పు
అరటిపండు ఒకటి
చాక్లెట్ ఒకటి(చిన్నది)
పంచదార ఒక టీ స్పూన్
తయారు చేసే విధానం :
చాక్లెట్ ముక్కలు,అరటిపండు,పంచదార మిక్సీ జార్ లో వేసి గ్రైండ్
చెయ్యాలి.
ఇందులో చల్లని పాలు పోసి బ్లెండ్ చేసి తీసుకోవాలి.
పైన కొంచెం చాక్లెట్ గ్రేట్ చేసి వేస్తే కలర్ ఫుల్ గా ఉంటుంది.
టేస్ట్ ను బట్టి పంచదార ఇంకా వేసుకోవచ్చు.
0 comments:
Post a Comment