Thursday, May 5, 2011

బెండకాయ ఓట్స్ ఫ్రై

లేలేత బెండకాయల ఫ్రై అందరూ చాలా ఇష్టపడతారు.రొటీన్ గా చేసేది  

కాకుండా ఓట్స్,ఉల్లిపాయ వేసి చేస్తే కూడా చాలా బావుంటుంది.

మైక్రో వేవ్ లో చేస్తే ఇంకా ఈజీగా అయిపోతుంది.జిగురు లేకుండా 

కూర పొడిపొడిగా వస్తుంది.




కావలసిన  పదార్ధాలు  :

బెండకాయలు                          పావుకిలో 

ఉల్లిపాయ                               ఒకటి 

మిర్చి                                    రెండు 

ఓట్స్                                     మూడు టేబుల్ స్పూన్లు 

ఉప్పు,కారం                             తగినంత 

నూనె                                    మూడు టేబుల్ స్పూన్లు 

కరివేపాకు                               ఒక రెమ్మ 

గరం మసాల పొడి                    అర టీ స్పూన్ 

తాలింపుకు 

శనగపప్పు,మినప్పప్పు,ఆవాలు,జీలకర్ర,ఎండుమిర్చి,వెల్లుల్లి రెబ్బలు 


తయారు చేసే విధానం:

ఒక మైక్రో సేఫ్ బౌల్ లో నూనె,తాలింపు దినుసులు,వెల్లుల్లిరెబ్బలు  

వేసి ఒక నిమిషం హైలో పెట్టాలి.

అవి వేగాక తీసి సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి,కరివేపాకు వేసి రెండు 

నిముషాలు ఉంచాలి.

ఇప్పుడు తరిగిన బెండకాయ ముక్కలు వేసి కలిపి హైలో ఉంచాలి.

ముక్కలు వేగాక ఉప్పు,కారం,ఓట్స్ వేసి బాగా కలిపి మళ్లీ ఓవెన్ లో 

పెట్టాలి.

ఓట్స్ ఉడికి కూర వేగిపోయాక గరంమసాల పొడి చల్లి ఇంకో నిమిషం 

పెడితే సరిపోతుంది.

కూర వేగేటప్పుడు ప్రతి రెండు మూడు నిమిషాలకు ఒకసారి తీసి 

కలుపుకోవాలి.


Share/Bookmark

0 comments:

Post a Comment

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP