ఫ్రూట్ లస్సీ
లస్సీ అనగానే అరటిపండు,మామిడి పండు ఇలా ఏదైనా ఒక పండు
వేసి చేస్తాము కదా.అలా కాకుండా అన్ని పళ్ళూ కలిపి చేసే ఈ ఫ్రూట్
లస్సీ చాలా మంచి ఫ్లేవర్ తో రుచిగా ఉంటుంది.
కావలసిన పదార్ధాలు:
అరటిపండు ఒకటి
మామిడిముక్కలు ఒక కప్పు
పుచ్చకాయముక్కలు ఒక కప్పు
ద్రాక్ష అర కప్పు
యాపిల్ ముక్కలు అర కప్పు
పెరుగు పావు లీటరు
పంచదార అర కప్పు
వెనీలా ఎసెన్స్ రెండు చుక్కలు
ఐస్ క్యూబ్స్
తయారు చేసే విధానం :
అన్ని పళ్ళు మిక్సీజార్ లో వేసి గ్రైండ్ చేసుకోవాలి.
ఇందులో పంచదార,ఎసెన్స్,పెరుగు వేసి బ్లెండ్ చెయ్యాలి.
చివరిగా క్రష్ చేసిన ఐస్ క్యూబ్స్ వేసి బ్లెండ్ చేసి సర్వ్ చేసుకోవాలి.
0 comments:
Post a Comment