Monday, May 2, 2011

యాపిల్ బ్రెడ్ హల్వా

హల్వా అనగానే జనరల్ గా కారట్,సొరకాయ,బీట్రూట్ వీటితోనే 

ఎక్కువ చేస్తాము.కొంచెం వెరైటీగా యాపిల్ తురుము,బ్రెడ్ కలిపి చేసే 

ఈ హల్వా రుచిగా డిఫెరెంట్ టేస్ట్ తో పిల్లలకి చాలా నచ్చుతుంది.





 కావలసిన పదార్ధాలు:


యాపిల్                       ఒకటి 

బ్రెడ్                            నాలుగు స్లైసెస్

పాలు                          రెండు కప్పులు 

నెయ్యి                        మూడు టేబుల్ స్పూన్లు 

పంచదార                     ఒకటిన్నర కప్ 

ఇలాచీ పొడి                   పావు స్పూన్

కాజూ,బాదం  


 తయారు చేసే విధానం :

ముందుగ బ్రెడ్ స్లైసెస్ ని క్రంబ్స్ గ చేసుకోవాలి.

ఒక స్పూన్ నెయ్యి వేడిచేసి ఈ క్రంబ్స్ ను దోరగా వేయించి తీసుకోవాలి 

మైక్రోవేవ్ లో అయితే ఒక నిమిషం హైలో పెట్టి తరువాత టెంపరేచర్ 

తగ్గించి మరో రెండు నిముషాలు పెడితే చక్కగా క్రిస్ప్ గా ఫ్రై అవుతాయి.

ఒక స్పూన్ నెయ్యి వేడిచేసి కాజూ వేయించి తీసుకోవాలి.ఇదే నేతిలో 

యాపిల్ తురుము వేసి వేయించాలి.

తురుము వేగిన తరువాత బ్రెడ్ క్రంబ్స్ కూడా వేసి కలపాలి 

ఇప్పుడు పాలు,పంచదార వేసి సన్నని మంటపై బాగా దగ్గర పడేవరకు 

ఉడికించి ఇలాచీ పొడి,మిగిలిన నెయ్యి వేయాలి.

ఒక బౌల్ లోకి తీసుకుని కాజూ,బాదంతో అలంకరిస్తే ఎంతో రుచిగా 

ఉండే యాపిల్ బ్రెడ్ హల్వా నోరూరిస్తుంది.  

యాపిల్ పుల్లగా ఉంటే పాలు వేయగానే విరిగిపోయే అవకాశం ఉంది.

అందుకని పులుపు లేకుండా ఉంటే బావుంటుంది.

ఇష్టం ఉన్నవారు ఇంకొంచెం నెయ్యి వేసుకోవచ్చు.


Share/Bookmark

0 comments:

Post a Comment

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP