Tuesday, February 1, 2011

మసాలా బేబీపొటాటోస్

ఈ సీజన్ లో చిన్నచిన్న బేబీపొటాటో లు బాగా దొరుకుతాయి వీటితో 

ఎక్కువగా గ్రేవీ కూరలు,దం ఆలూ చేస్తాము కదా,ఇలా మసాలా ఫ్రై చేస్తే 

కూడా చాలా బావుంటుంది.రైస్, చపాతిలోకి ,సాంబారు,రసం వీటిలోకి 

జతగా ఇవి బావుంటాయి.








కావలసిన పదార్ధాలు :


బేబీ ఆలూ                       పావుకిలో 

ఉల్లిపాయ                        ఒకటి 

మిర్చి                            అయిదు 

అల్లంవెల్లుల్లి ముద్ద             ఒక టీ స్పూను 

గరంమసాల పొడి               ఒక టీ స్పూను 

ఉప్పు,కారం                       తగినంత 

పసుపు                            పావు స్పూను 

కరివేపాకు                         ఒక రెమ్మ 

కొత్తిమీర                            ఒక కట్ట 

నూనె                               మూడు టేబుల్ స్పూన్లు 

తాలింపుకు శనగపప్పు,మినప్పప్పు,ఆవాలు,జీలకర్ర ,ఎండుమిర్చి.


తయారు చేసే విధానం:


ముందుగా ఆలూ ఉడికించి పొట్టు తీసి ఉంచాలి.

పచ్చిమిర్చి,కొత్తిమీర కలిపి గ్రైండ్ చేసుకోవాలి.

నూనె వేడి చేసి తాలింపు వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు,

కరివేపాకు వేసి వేయించాలి.

ఇప్పుడు అల్లంవెల్లుల్లి ముద్ద,పసుపు,మిర్చి కొత్తిమీర పేస్ట్ వేసి 

వేయించాలి 

తరువాత ఆలూ వేసి,ఉప్పు,కారం వేసి సన్నని సెగపై బాగా వేగనివ్వాలి.

చివరిగా గరంమసాలా పొడి వేసి  కొంచెం వేయించి దింపెయ్యాలి

ఒక బౌల్ లోకి తీసుకుని కొత్తిమీర చల్లి సర్వ్ చెయ్యాలి


Share/Bookmark

9 comments:

రాధిక(నాని )

బాగుందండి

లత

థాంక్యూ రాధికా

Murali

Chala Bavundandi. Meeru Garam masala annitilo use chestaru, ee garam masala intlo chesinada leka store lo konnada. Store bought ayithe ee brand do cheppandi.

లత

థాంక్యూ మురళి గారూ
గరం మసాలాపొడి నేను ఇంట్లొనే చేస్తాను
బయట దొరికే వాటిలో బిర్యానిలో వాడే జాపత్రి లాంటివి వేస్తారు దానితో ఫ్లేవర్ మారిపొతుంది.
లవంగాలు,దాల్చినచెక్క,జీలకర్ర,ధనియాలు కొంచెం వేయించి పౌడర్ చేసుకుంటే సరిపోతుంది

Murali

thanks Andi mari kolatalu kooda chepparante nenu kooda garam masala intilone chesukuni mee laga kakapoina konchem ruchi karamga vantalu chesukuntanu.

Thanks once again.

సుమలత

థాంక్స్ అండి నేను అడుగుదాం అనుకునాన్ను.నా ప్రశ్న మురళి గారు
అడిగారూ.ఒన్స్ థాంక్స్ టు మురళి గారు మొత్తానికి మీ వంటకం అదిరింది

లత

తప్పకుండా మురళి గారూ
ఈ రోజు రాసి పోస్ట్ వేస్తాను
థాంక్స్ సుమలత గారూ

ఇందు

Wow! chala bagundi.nenu baby potatos thoc hesta kani ee variety teleedu :) Nice

లత

బావుంటుంది ఇందూ.చేసి చూడండి

Post a Comment

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP