గరంమసాలా పొడి
వంట చేసేటప్పుడు హడావుడి లేకుండా ఈజీ గా అయిపోవాలంటే ఈ
గరంమసాలా పొడి,అల్లంవెల్లుల్లి పేస్ట్ ,చింతపండుపేస్ట్,ఇలాంటివి రెడీగా
ఉంచుకుంటే చాలా సుఖంగా ఉంటుంది.బహుశా ఇవి అందరికీ
తెలిసినవే అయినా నేను ఫాలో అయ్యేవి చెప్తాను.
గరంమసాలా పొడి
కావలసిన పదార్ధాలు :
లవంగాలు 25
దాల్చిన చెక్క 5 గ్రాములు
జీలకర్ర అర కప్పు
ధనియాలు ఒకటిన్నర కప్పులు
కప్ అంటే కాఫీ కప్ కొలత తీసుకోవచ్చు
అన్నీ కలిపి ఒక పాన్ లో వేసి,స్టవ్ పై సిమ్ లో రెండు మూడు
నిమిషాలు వేయించాలి.
కొంచెం సువాసన రాగానే ఆఫ్ చేసి చల్లారాక మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఒక బాటిల్ లో పోసుకుని స్టోర్ చేసుకుంటే నెల రోజులైనా ఫ్రెష్ గా
ఉంటుంది.తడి మాత్రం తగలకూడదు.
మరీ స్పైసీగా ఉంది అనిపిస్తే ఎవరి టేస్ట్ కి తగ్గట్టు వారు మార్పులు
చేసుకోవచ్చు.ఖచ్చితంగా ఇంతే కొలత అని అక్కర్లేదు షుమారుగా
వేసుకోవచ్చు.ఇది ఉంటే విడిగా ధనియాల పొడి,జీలకర్ర పొడి
వెయ్యక్కర్లేదు.ఇది ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది
చింతపండు పేస్ట్ :
ఒక పావు కిలో చింతపండు లో ఒక గ్లాస్ నీళ్ళు పోసి స్టవ్ పై పొంగు
వచ్చేవరకూ ఉంచి దింపెయ్యాలి.చల్లారాక చిల్లుల పళ్ళెం (జల్లెడ) లో
వేసి మొత్తం పులుసు చిక్కగా తీయాలి.అవసరం అయితే కొంచెం
నీళ్ళు వాడవచ్చు.
ఈ గుజ్జును మళ్లీ స్టవ్ పై ఉంచి చిక్కబడేదాకా ఉడికించాలి.చల్లారాక
ఒక బాటిల్ లోకి తీసుకుని ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవాలి.తడి తగలకపోతే
నెలరోజులైనా నిలువ ఉంటుంది.
పప్పు,సాంబారు,రసం, పులుసు ఇలా ఏది చేసినా రెండు స్పూన్లు
వేసేస్తే సరిపోతుంది.అప్పటికప్పుడు నానబెట్టడం,హడావుడి ఉండదు.
అల్లంవెల్లుల్లి పేస్ట్ :
ఒక కప్ అల్లం ముక్కలు,ఒక కప్ వెల్లుల్లి రెబ్బలు,చిటికెడు పసుపు,
అరస్పూను నూనె వేసి గ్రైండ్ చేసుకుని ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవాలి.
కూరల్లోకి అయినా,ఏ రైస్ ఐటం చెయ్యాలన్నా ఈజీగా ఉంటుంది..
ఈ కొలతలతో చేస్తే ఒక వారం రోజులు వస్తుంది.
నాన్ వెజ్ కర్రీస్ కి మాత్రం,అల్లంవెల్లుల్లి అయినా,గరంమసాలా పొడి
అయినా అప్పటికప్పుడు ఫ్రెష్ గా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ బావుంటుంది.
వెల్లుల్లి రెబ్బలు:
ఖాళీ గా ఉన్నప్పుడు ఒక వెల్లుల్లి పాయ రెబ్బలు వలిచి చిన్నబాటిల్లో
వేసి ఫ్రిజ్ లో ఉంచుకుంటే తాలింపు వేసేటప్పుడు ఒకటి రెండు చిదిమి
వేసెయ్యొచ్చు.
కారం ;
ఇదివరకు మిరపకాయలు కొని ఎండబెట్టి కారం కొట్టించే వాళ్ళు కానీ
ఇప్పుడు అంతా రెడీమేడ్ కదా .బయటకొనేది పచ్చికారం.దీనికి కొంచెం
దినుసులు పొడి కొట్టి కలుపుకుంటే కూరల్లోకి రుచికరమైన కారం
తయారవుతుంది.
కారం అరకిలో
జీలకర్ర అర కప్పు
మెంతులు రెండు టీ స్పూన్లు
ఉప్పు రెండు టీ స్పూన్లు
వెల్లుల్లి పాయ ఒకటి
ధనియాలు,జీలకర్ర ,మెంతులు సన్నని సెగపై వేయించాలి.మెంతులు
వేగిన సువాసన రాగానే దించేసి అందులోనే ఉప్పు వేయాలి.
కొంచెం చల్లారాక మెత్తగా గ్రైండ్ చెయ్యాలి.ఇందులో వలిచిన వెల్లుల్లి
రెబ్బలు చేసి మళ్లీ గ్రైండ్ చెయ్యాలి
చివరిగా కారం వేసి ఒకసారి గ్రైండ్ చెయ్యాలి
బాగా కలిపి బాటిల్ లోకి తీసి స్టోర్ చేసుకోవాలి ,కొంచెం చిన్నదానిలోకి
తీసుకుని వాడుకోవచ్చు.ఇలా ఒక అరకిలో చేసుకుంటే దాదాపు
మూడు నెలలు వస్తుంది.
ఏ కూరలో వేసినా కమ్మని రుచి వస్తుంది.

ధనియాలు ఒక కప్ (కాఫీ కప్ కొలత )

2 comments:
Chala thanks andi ee weekend gar am masala and chicken biryani chestanu
chesi ela vachhindi cheppandi
Post a Comment