Sunday, February 27, 2011

పచ్చి టమాటా పచ్చడి

టమాటా పచ్చడి అనగానే ఎర్రగా నోరూరిస్తూ పండు టమాటాలతో చేసే 

పచ్చడి గుర్తొస్తుంది.అలాగే గట్టిగా ఆకుపచ్చగా ఉండే పచ్చి టమాటాలతో

చేస్తే కూడా చాలా బావుంటుంది.అన్నం లోకే కాకుండా ఇడ్లీ,దోశ లాంటి 

టిఫిన్స్ లోకి కూడా బాగుంటుంది.







కావలసిన పదార్ధాలు 

పచ్చి టమాటాలు                   పావుకిలో 

పచ్చిమిర్చి                         ఎనిమిది 

వెల్లుల్లి రెబ్బలు                     నాలుగు 

జీలకర్ర                               అర స్పూను 

ఉప్పు                                తగినంత

కరివేపాకు                         ఒక రెమ్మ 

కొత్తిమీర                            ఒక కట్ట 

నూనె                                నాలుగు స్పూన్లు 

తాలింపుకు 

శనగపప్పు,మినప్పప్పు,ఆవాలు,ఎండుమిర్చి 

తయారు చేసే విధానం :

టమాటాలను ముక్కలు కోసి ,మిర్చి,కొత్తిమీర కలిపి రెండు స్పూన్ల 

నూనె వేసి నీరంతా పోయేవరకూ వేయించాలి.

టమాటాలు పులుపు కాబట్టి మిర్చి కొంచెం ఎక్కువే పడతాయి.కారం 

తక్కువ తినేవారు తగ్గించుకోవచ్చు.

చల్లారాక  ముందు మిర్చి,ఉప్పు,జీలకర్ర,వెల్లుల్లి గ్రైండ్ చెయ్యాలి.

ఇప్పుడు వేగిన టమాటా ముక్కలు కూడా వేసి గ్రైండ్ చెయ్యాలి

నూనె వేడి చేసి తాలింపు వేసి పచ్చడిలో కలిపితే పుల్లగా ,రుచిగా ఉండే 

పచ్చిటమాటా పచ్చడి సిద్దం.





Share/Bookmark

5 comments:

Admin

bagundandi,eppude chesi chusta.ee roju sunday kada prayogam chestanu.

Anonymous

అన్నంలో పచ్చిటమేటా పచ్చడి బాగుంటుంది, పచ్చికొబ్బెర కూడా వేస్తారనుకుంటా. .

లత

థాంక్యూ లక్ష్మిగారూ,


snkr గారూ థాంక్స్ అండి.ఇష్టం ఉన్నవారు కొంచెం కొబ్బరి వేసుకోవచ్చు,నాకు ఇలా ప్లెయిన్ గా చెయ్యడం అలవాటు

ప్రణీత స్వాతి

bagundandee. kanee pachchi tomatoes lo neeruntundaa? gattigaa vuntaayemo?

లత

స్వాతిగారూ.గట్టిగా ఉన్నా ఉడికేసరికి కొంచెం నీరు వస్తుందండీ.
థాంక్యూ

Post a Comment

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP